Home News Stories

చిరంజీవిని కలిసిన తలసాని! జగన్ కి దెబ్బకొట్టేందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో చిరంజీవి నివాసంలో.. చిరంజీవి, నాగార్జునలతో సమావేశమైన మంత్రి తలసాని. సినిమారంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పై చర్చ.

కేసీఆర్ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చాక టాలీవుడ్ పై సరైన దృష్టి పెట్టలేదని ప్రచారం జరిగింది. ఆంధ్రాకి చెందిన నిర్మాతలు, నటులు ఉండటంతో అంతా చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఆయనకు సహకారం అందజేశారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఓ పక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఎటువంటి ఇబ్బందులు లేని పరిస్థితి, మరో పక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉండటంతో చంద్రబాబు అనుకూల తెలుగు సినిమా నిర్మాతలు, నటులు హైదరాబాద్ కేంద్రంగానే ఉండటానికి పూర్తి నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. చిరంజీవి ఇటీవల జగన్ ని కలిశాక, ఇప్పుడు కేసీఆర్ మంత్రి తలసానిని చిరంజీవిని కలిసే బాధ్యత అప్పగించారు. వీరు ఏం మాట్లాడారు అన్నది పూర్తిగా వెల్లడి కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here