టాలీవుడ్‌ని గబ్బు పట్టించిన శ్రీరెడ్డి బట్టలిప్పి బజార్న పడటానికి ముందే ఆమెకు మద్దతుగా ఒకే ఒక దర్శకుడు ముందుకొచ్చాడు. ఆమెకు రెండు సిన్మాల్లో ఛాన్సిస్తానన్నాడు. ఎవరో అల్లాటప్పా డైరెక్టర్ కూడా కాదు. ఈమధ్యే నేనే రాజు..నేనేమంత్రి సిన్మాతో ఓ గట్టి హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్న తేజ. ఆ దర్శకుడికి ఎంత విశాల హృదయమో అనుకున్నారు. ఏంచేసినా శ్రీరెడ్డి అతని రుణం తీర్చుకోలేదని కూడా అనేసుకున్నారు. కానీ నేనున్నానని ముందుకొచ్చిన తేజని కూడా బకరాని చేసేసింది శ్రీరెడ్డి.
శ్రీరెడ్డి పవన్‌కళ్యాణ్‌తో పాటు ఆయన తల్లిని తిట్టడం, ఆ ఘనకార్యం తనదేనని పనీపాటా లేని రాంగోపాల్‌వర్మ చెప్పడం…ఇక ఆ తర్వాత జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ సురేష్‌బాబు కొడుకు అభిరాంని వీధిలోకి లాగకుండా ఉండేందుకు శ్రీరెడ్డికి ఐదుకోట్లు ఇప్పించేందుకు బ్రోకర్(మధ్యవర్తిత్వం అని కాస్త క్లాస్‌గా చెప్పుకునే ప్రయత్నం) పనిచేసింది తానేనని నిస్సిగ్గుగా ఒప్పేసుకున్నాడు వర్మ.
సురేష్‌బాబు కోసం తానే మీడియేషన్ చేశానని వర్మ చెప్పుకున్నాక కూడా దాని వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, పచ్చమీడియా ప్లాన్ ఉందనీ పవన్‌కళ్యాణ్ నానా హంగామా చేసి కోరి కొరివితో తలగోక్కున్నాడు..అది వేరే విషయం.
ఇప్పుడు వర్మకంటే ముందే కాంప్రమైజ్ కోసం వేరొకరు ప్రయత్నించారని బాంబు పేల్చింది శ్రీరెడ్డి. ఆయన మరెవరో కాదు తేజేనట. ఇన్నాళ్లూ చెప్పకూడదనుకున్నాను..కానీ ఇప్పుడు చెప్పేస్తున్నానంటూ ఛాన్సులిస్తానన్న తేజని కూడా బజారుకి లాగేసింది శ్రీరెడ్డి. సురేష్‌బాబు చెప్పడం వల్లే తేజ రెండుసిన్మాలు ఆఫర్ చేశాడట.
పెద్దవాళ్లతో(అంటే సురేష్‌బాబు ఫ్యామిలీతో అన్నమాట) పెట్టుకుంటే మనకే ఇబ్బందని శ్రీరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట తేజ. రెండు సిన్మాల్లో ఛాన్స్ ఇస్తామని చెప్పడమే కాకుండా ఎంతో కొంత తీసుకోమని ఆఫర్ చేస్తే తాను నో చెప్పాకే వర్మ లైన్లోకొచ్చాడట. ఇప్పటిదాకా అంతా బ్రోకర్ పని చేసింది వర్మేననుకున్నారు. ఈ వ్యవహారంలో అంతకంటే ముందే తలదూర్చిన పాపానికి పాపం తేజ జోకర్ అయిపోయాడన్నమాట.