ఇండియా మొత్తన్ని కరోనా కుదిపేస్తున్న సమయంలో ఎన్నికల్లో ఘోర ఓటములతో డీలా పడ్డా టీడీపీకి మాత్రం ఈ సమయం బాగా కలిసొచ్చిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కరోనా కనుక లేకపోయి ఉంటే.. టీడీపీ పరిస్థితి రాజకీయంగా వేరేగా ఉండేదని.. కరోనా రావడంతో పరిస్థితి మారిందని సెటైర్లు వేస్తున్నారు.

ఎన్నికల్లో వరుస ఓటములు కుంద దీస్తున్నాయి. ఇదే సమయంలో అధికారపక్షానికి కునుకు లేకుండా చేస్తుంది కరోనా. కార్పోరేషన్,మున్సిపల్ ఎన్నికలు ఆ పై తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా టీడీపీ పరువు నిలబెట్టుకోలేకపోయింది. దీంతో టీడీపీ రాజకీయంగా కష్టాలు మొదలైనట్లేనని పార్టీ శ్రేణులు సైతం లెక్కలేశాయి. అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో టీడీపీ ఓటముల పై చర్చ కనుమరుగైంది.
అయితే.. ఇంతలోనే.. రాష్ట్రంలో కరోనా ముసురుకోవడంతో తిరుపతి ఫలితం సహా చంద్రబాబు నాయకత్వపై వచ్చిన దుమారం కూడా దారితప్పేసింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. తిరుపతి ఉప ఎన్నిక ఫలితంపై చర్చను పక్కన పెట్టి.. కేవలం కరోనాపైనే దృష్టి పెట్టారు. దీంతో తిరుపతి సహా స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఎఫెక్ట్ తుడిచిపెట్టుకుపోయి.. కేవలం ఇప్పుడు కరోనా మాత్రమే టీడీపీ రాజకీయ వస్తువుగా మారింది.