Home News Stories

టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ల కరువు…!

తెలుగు దేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్ల కరువు వచ్చినట్లు కనిపిస్తోంది … ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్త ప్రచారానికి పార్టీ ప్రకటించిన లిస్ట్ చూస్తే ఆ విషయం స్పష్టం అవుతుంది. కనీసం జిల్లా స్థాయి లేని వారిని … పార్టీ శ్రేణులకు పరిచయం లేని వారిని సైతం స్టార్ క్యాంపెయినర్‌ల లిస్ట్ లో చేర్చేశారు టిడిపి పెద్దలు.. ఆ లిస్ట్‌ చూస్తూ నవ్వాలో? ఏడవాలో? అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు….

తెలుగుదేశం అంటే స్టార్ లకు కొదవ లేని పార్టీ… అటు సినిమా నటులు …ఇటు రాజకీయ ఉద్దండులు … పార్టీలో లెక్కలేనంత మంది ఉండేవారు… తమ ప్రసంగాలతో, విమర్శలతో ప్రత్యర్ధిపార్టీలపై విరుచుకుపడే నేతలు కోకొల్లలుగా ఉండేవారు… అయితే ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు…. సాధారణంగా ఎన్నికల సమయంలో అన్నిపార్టీలు అందుబాటులో ఉంటే స్టార్ క్యాంపెయినర్ల తో ప్రచారం చేయించడానికి ప్రయత్నిస్తుంటాయి… దీని కోసం తమ పార్టీలో ఉన్న నేతలతో పాటు … సినిమా వాళ్లను, పార్టీ మద్దతుదారులైన ప్రముఖులను ఆయా వర్గాలను ఆకట్టుకునేలా రంగంలోకి దింపుతుంటాయి …

స్టార్ల ఎంట్రీతో ఎన్నికల ప్రచారానికి సరి కొత్త ఊపు వస్తుందని…ప్రజలను ఆకట్టుకోవచ్చని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి … అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 30 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌పై మాత్రం పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. .. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటిస్తూన్నారు… ఒకే రోజు మూడు,నాలుగు మీటింగ్ లు పెడుతూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో మంగళగిరిలో బరిలో నిలిచిన లోకేష్ తో కూడా రాష్ట్రంలో పలు చోట్ల ప్రచారం చేయించడానికి రూట్‌మ్యాప్‌ రెడీ చేస్తున్నారు .. అలాగే యనమల, సుజన చౌదరి వంటి సీనియర్ నేతలను కూడా ప్రచారానికి పంపుతున్నారు… వైసిపి నుంచి టిడిపిలో చేరిన వంగవీటి రాధాకి కూడా ప్రచార భాద్యతలు అప్పగించారు.
సామాజికంగా గట్టి ప్రభావం చూపే ప్రాంతాల్లో రాధా ప్రచారం పార్టీ ప్లస్‌ అవుతుందన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారు.

ఇక పలువురు కార్పొరేషన్ చైర్మన్లను ప్రచారానికి పంపుతున్నారు. కార్పొరేషన్ల ద్వారా జరిగిన లబ్దిని ఆయా వర్గాలకు వివరించడానికి వారి ప్రచారం ఉపయోగపడే అవకాశముంది… అంత వరకు బాగానే ఉన్నా .. పార్టీ విడుదల చేసిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది .. టిడిపి ప్రకటించిన 30 మంది లిస్టులో కనీసం జిల్లా స్థాయి కూడా లేని నేతలకు చోటుదక్కింది… వారిలో కొందరి పేర్లు అయితే పార్టీలోనే చాలా మందికి తెలియని పరిస్థితి … ముఖ్యంగా టీవీ డిబేట్లకు వెళ్లే వారిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చెయ్యడం పై నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు… దాన్ని చూసి కొందరు నేతలు సెటైర్లు వేస్తూ నవ్వుకుంటున్నారు … ముక్కూ ముఖం తెలియని వారు… పార్టీలో నేతలే గుర్తించని వారు వచ్చి .. తమకు మద్దతుగా ఏమని ప్రచారం చేస్తారని అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు .. మరి ఆ జాబితా వెనుక మతలబు ఏంటో దాన్ని రూపొందించిన వారికే తెలియాలి..

ఇక టీడీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విషయానికి వస్తే..
చంద్రబాబునాయుడు
యనమల రామకృష్ణుడు
నారా లోకేష్

వంగవీటి రాధా
మురళీమోహన్
దివ్యవాణి
నందమూరి బాలకృష్ణ
అంబికాకృష్ణ
సుజనాచౌదరి
ఫరూక్
వర్ల రామయ్య
జూపూడి ప్రభాకర్
నాగుల్ మీరా
లంకా దినకర్
కోటేశ్వరరావు
వైవీబీ రాజేంద్రప్రసాద్‌
పంచుమర్తి అనూరాధ
బుద్ధా వెంకన్న
పోతుల సునీత
కాకి గోవిందరెడ్డి
బీటీ నాయుడు
దువ్వారపు రామారావు
ఆనంద్ సూర్య
అశోక్ బాబు
విజయభారతి
రేవతి
రామాంజనేయులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here