Home News Politics

సిట్టింగ్ ల్లో గుబులు రేపుతున్న చంద్రబాబు…!

అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మళ్లీ అధికారంలోకి రావడమే టార్గెట్‌గా పావులు కదుపుతోంది టీడీపీ .. అందులో భాగంగా వచ్చే ఎన్నికలకు ముందుగానే అభ్యర్ధులను ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు.. అదే సమయంలో పనితీరు బేరీజు వేసుకుని పలువురు సిట్టింగు ఎమ్మెల్యేలను మారుస్తారన్న ప్రచారం పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది.

అన్ని కోణాల్లో ఆలోచించి… ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు .. ముఖ్యంగా ఎన్నికల అభ్యర్ధుల విషయంలో ఆఖరి నిముషం దాకా కసరత్తు చేస్తూ అందర్నీ టెన్షన్‌ పెడతారు.. ఇదీ టిడిపి అధినేత చంద్రబాబుపై పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం … అయితే ఈ సారి ఆయన ట్రెండ్‌ మార్చారు.. ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేస్తానని ప్రకటించి.. ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేస్తున్నారు .. ఇప్పటికే 75 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసారని, మరో 25 సెగ్మెంట్లకు సంబంధించిన కసరత్తు చివరి దశలో ఉందని చెప్తున్నారు.

అదే సమయంలో పార్టీ అభ్యర్ధులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీడీపీ అధినేత .. ఎక్కడా ఛాన్స్‌ తీసుకోకుండా అన్ని చోట్ల బలమైన అభ్యర్ధులనే బరిలోకి దింపడానికి ఎక్సర్‌సైజ్‌ చేస్తున్నారు … ఇప్పటికే క్యాండెట్లు, సిట్టింగులపై పలు సర్వేలు చేయించుకున్న ఆయన అభ్యర్ధుల ఎంపికలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు .. ఆ క్రమంలో తనకు అందిన నివేదికల మేరకు .. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సుమారు 30 నుంచి 40 మందిని మార్చే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి….

అవినీత ఆరోపణలు, సొంత అజెండాలతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు , పనితీరు, ప్రజల్లో ఉన్న అసంతృప్తి వంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని సదరు సిట్టింగులను పక్కన పెడుతున్నారట… ఎమ్మెల్యేల అవినీతిపైనే ఏపిలో ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది.. అది సీఎం దృష్టికి కూడా వచ్చింది.. కొత్తకొత్త సంక్షమే పథకాలతో ప్రజలకు వేల కోట్ల ఫలాలు అందిస్తున్నా.. ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలపైనే జనంలో చర్చ జరుగుతుండటాన్ని సీఎం గుర్తించారు.. అందుకే అటువంటి వారిని మారిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు..

ఇప్పటికే సరిగా పని చేయని వారు తమ పనితీరు మెరుగు పర్చుకోవాలంటూ చాలా టైమ్ ఇచ్చారు .. అయినా తీరు మార్చుకోని వారికి ఈసారి టిక్కెట్లు ఇవ్వడం కష్టంగానే కన్పిస్తోంది… ఈ జాబితాలో సుమారు 30 నుంచి 40 మంది ఉంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది… ఈ క్రమంలో చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం వంటి జల్లాల్లో సిట్టింగులను మార్చే జాబితా కాస్త ఎక్కువగా ఉన్నట్టు సమాచారం…

అలాగే వైసీపీ నుంచి వచ్చిన 23 మంది ఎమ్మెల్యేల్లో కనీసం ఏడెనిమిది మందికి ఈసారి టికెట్లు దక్కడం కష్టమే అంటున్నారు… వారిలో ఎస్సీ సెగ్మెంట్లకు చెందిన అభ్యర్థులే ఎక్కువ ఉండే ఛాన్స్ కన్పిస్తోంది… చిత్తూరు జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు ఈ తరహా వార్నింగులు వెళ్లాయని చెప్తున్నారు . .. అలాగే గుంటూరు జిల్లాలోని ఒకరిద్దరి ఎమ్మెల్యేలకు కూడా ఇదే తరహా వార్నింగులు వెళ్లాయని తెలుస్తోంది… తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ విధంగా సిట్టింగులుగా ఉంటూ స్థానాలు కొల్పోయేవారి జాబితాలో ఒకరిద్దరు మంత్రులు కూడా ఉన్నారని సమాచారం.

అలాగే తాజాగా కొన్ని జిల్లాల్లో చేరికలు జరుగుతున్న తరుణంలో … దానికి అనుగుణంగా మరిన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి … ఈ క్రమంలో విశాఖ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ మేరకు మార్పులు జరిగే ఛాన్సులు ఎక్కువంటున్నారు …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here