ఏపీలో మరో అసెంబ్లీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కానుంది. అదీ సీఎం సొంత జిల్లా కడపలో..బద్వేల్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో రెండు నెలలక్రితం మృతిచెందారు. ఎన్నిక ఆరు నెలల్లోపు జరగాల్సి ఉంది. వెంకటసుబ్బయ్య కుటుంబానికే టిక్కెట్ ఇస్తానని జగన్ ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం పోటీ పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బద్వేలు ఎన్నికకు దూరంగా ఉండాలని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

వైఎస్ కుటుంబానికి పట్టున్న ప్రాంతమైన బద్వేల్ లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హవా నడుస్తుంది. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీకి 30 వేలకు పైగా మెజార్టీ వచ్చింది. తిరుపతి ఉపఎన్నిక ఫలితం స్థానిక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత టీడీపీ కాస్త పునరాలోచనలో పడింది. పోటీచేసి పరువు పోగొట్టుకునేకంటే పోటీకి దూరంగా ఉండటమే మంచిదన్న సూచనలు పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి. చంద్రబాబు కడప జిల్లా నేతలతో ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది.
టీడీపీ ఆవిర్భావం తర్వాత బద్వేలుల 4 సార్లు విజయం సాధించింది. దీంతో పోటీ చేయాలా వద్ద్ద అన్నా మీమాంస పార్టీ అధినేతలో ఉంది. ఒక వేళ పోటీకి దూరంగా ఉంటే పార్టీ ఓటు బ్యాంక్ చీలిపోతుందా అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద బద్వేలు ఉప ఎన్నికపై చంద్రబాబు డైలమాలో ఉన్నారని చెబుతున్నారు.