Home News

మూడు సంవత్సరాల్లో అధికారం మాదే అంటున్న టీడీపీ…!

ఓటమి ప్రభావం నుంచి టిడిపి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది .. ఒకవైపు వలసలు పెరిగిపోతున్నా .. చంద్రబాబునాయుడు జనంలోకి వస్తుండటంతో కేడర్‌లో ఒకింత జోష్‌ కనిపిస్తోంది .. కొత్త ప్రభుత్వంపై విమర్శలకు కొంత సమయమివ్వాలని అనుకున్నప్పటికీ .. జరుగుతున్న పరిణామాలతో అధినేతతో సహా మిగిలిన నేతలు కూడా వాయిస్‌ పెంచుతున్నారు.. అదే టైంలో టిడిపి శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఆశలేంటి అంటారా అదే మూడు సంవత్సరాల్లో ఎన్నికలు…

ఏపి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడగానే టిడిపి అధినేత చంద్రబాబు ఒక స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు … సర్కారుపై అప్పుడే విమర్శులు, మాటల దాడులు వద్దని… ఆరు నెలల నుంచి సంవత్సరంపాటు సమయమిచ్చి చూద్దామని.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ..అయితే రెండు నెలలు కూడా గడవకుండానే సీన్‌ మారిపోయింది .. స్వయంగా చంద్రబాబునాయుడే వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారు .. దాడుల్లో మృతిచెందిన టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్న ఆయన హత్యారాజకీయాలపై ఫైర్‌ అవుతున్నారు .. ఇక లోకేష్‌ అయితే ట్విట్టర్‌లో ఒక రేంజ్లో చెలరేగిపోతున్నారు ..

పార్టీ ప్రెసిడెంట్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చూపిస్తున్న దూకుడుతో ఇతర పార్టీ నేతలు కూడా సర్కారును టార్గెట్‌ చేస్తున్నారు .. సహజంగానే ఇవన్నీ ఢీలా పడిపోయిన పార్టీ కేడర్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి .. ఒక వైపు వలసలు పెరిగిపోతున్నా పార్టీ ముఖ్యులు డోంట్‌ కేర్‌ అన్నట్లు వ్యవహరిస్తుండటం తెలుగుతమ్ముళ్లను ఆశ్చర్యపరుస్తోంది .. ఆ క్రమంలో ప్రస్తుత సర్కారు పూర్తికాలం మనలేదని .. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ధీమాతో ఇప్పటి నుంచే పార్టీ నేతలు స్పీడ్‌ పెంచుతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది …

ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే ముందస్తు ఎన్నికల ఆశలేంటంటారా? అదేనండి జమిలీ ఆశలు .. జమిలి ఎన్నికలు తప్పవన్న ఆలోచనలో ఉన్న టిడిపి … 2022లోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వస్తాయని అంచనా వేస్తోంది .. ఆ ప్రచారం ఓటమి పాలైన నేతల్లో కూడా కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.. అదే సమయంలో డిలిమిటేషన్‌పై కూడా చర్చ జరుగుతోంది.. డిలిమిటేషన్‌ జరిగితే అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కి పెరిగి అవకాశాలు పెరుగుతాయని నేతలు యాక్టివ్‌ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ..

మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన జమిలీ ఎన్నికలకు లైన్‌క్లియర్‌ అయ్యే పరిస్తితి కనిపిస్తోంది .. జగన్ తో పాటు అన్ని రాష్ట్రాలు జమిలికి ఓకే చెప్పడం ఖాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. లోక్‌సభలో సంపూర్ణబలం ఉన్న బిజెపి.. రాజ్యసభలో కూడా బలం పెంచుకునే పనిలో ఉంది.. దాంతో జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యంగ సంస్కరణలకు చట్టసభల్లో అడ్డంకులు ఉండవంటున్నారు. ఆ లెక్కలతో ఉన్న టిడిపి .. పూర్తికాలం పాలించకపోతే వైసిపికే నష్టమంటోంది … అందుకే ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఎన్నికలు జరిగిన మాదే అధికారం అని ప్రకటనలు గుప్పిస్తున్నారు .. ఏదేమైనా టిడిపికి జమిలికి ఊరటగా కనిపిస్తోంది .. అందుకే జమిలిని స్వాగతించాలనే ఆలోచనలో టీడీపీ కనిపిస్తోంది ..

ఇప్పటికే వైఎస్‌ జగన్ సర్కార్ పై భారీ అంచనాలు, ఆశలు కనిపిస్తున్నాయంటోంది టిడిపి .. 151 గెలవడంతో హైప్ వచ్చి భారీ హోప్స్‌ పెరిగిపోయాయంటోంది .. ఇటు చూస్తే ఆర్ధిక ఇక్కట్లలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది .. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ హామీల అమలు ప్రశ్నార్ధకమవుతుందని .. ఈ అంశాలన్నీ తమకి కలిసి వస్తాయని టీడీపీ ఆశలు పెట్టుకుంది ..

మొత్తమ్మీద రాజ్యాంగ సవరణ తో జమిలి ఎన్నికలు ఖాయం అన్న ధీమాతో ఉన్న టిడిపి .. ఆ ప్రచారాన్ని తెరపైకి తెస్తోంది .. ఈ ప్రచారంతో వలసలకు కూడా బ్రేక్ వేయవచ్చన్నది పార్టీ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు….