Home News Stories

సుజనా సీన్‌ సితారా!

ఎదురుపడితే నమస్కారం పెట్టేలా ఉండాలి. మన హోదా చూసి శాల్యూట్‌ కొట్టాలి. కానీ పాపం…సుజనా చౌదరి పరిస్థితి మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌.లా మారిపోయింది. ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పిన ఈ కార్పొరేట్‌ పొలిటీషియన్‌ సేఫ్‌ సైడ్‌ కోసం బీజేపీలో చేరినా…కాలం మాత్రం కలిసిరావడం లేదు. ఎందుకు…ఏమిటీ..ఎలా…అని అడగొద్దు. గురువుగారి బ్యాక్‌.గ్రౌండ్‌ ఎఫెక్ట్ మరి. బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, కేంద్ర‌ మాజీ మంత్రి సుజ‌నాచౌద‌రికి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బ్యాడ్‌ ఎక్స్‌.పీరియన్స్‌ ఎదురైంది.

ఫ్లైట్‌ ఎక్కేందుకు విమానాశ్రయానికి వచ్చిన సుజనాచౌదరిని అధికారులు అడ్డుకున్నారు. టికెట్‌ కన్ఫం కాక కాదు, ఫ్లైట్ క్యాన్సిల్‌ అయ్యిందనీ కాదు. ఎక్కడానికి పర్మిషన్‌ లేదని. ఎందుకంటే ఏ మాఫియా మీదో, టెర్రరిస్టుల మీదో, బ్యాంకులను దోచుకున్నవారిమీదో ఇష్యూ అయ్యే లుకవుట్‌ నోటీస్‌ ఉందని. బ్యాంక్‌ ఫ్రాండ్‌ కేసులో సుజనాచౌదరిమీద లుకవుట్‌ నోటీస్‌ ఉండటంతో అధికారులు అడ్డుకున్నారు. విమానం ఎక్కడానికి ఒప్పుకోకుండా వెనక్కి పంపించేశారు.

అసలే ఎంపీ. పైగా అధికారపార్టీలో ఉన్నారు. ఇంతకంటే అవమానం మరోటి ఉంటుందా. కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీ కండువా కప్పుకున్నారన్న విమర్శల నుంచే ఆయనింకా బయటపడలేదు. ఈలోగా ఈ చేదు అనుభవం. దీంతో తనను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అక్రమంగా అడ్డుకున్నారంటూ హైకోర్టుని ఆశ్రయించారు సుజనాచౌదరి. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో ఎదురైన అనుభవంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయని అభ్యర్థించటంతో… రెండు వారాలు న్యూయార్క్ వెళ్లేందుకు సుజనా చౌదరికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే సీబీఐకి వివరాలన్నీ ఇచ్చి అమెరికా వెళ్లి రావాలని సుజనా చౌదరికి స్పష్టం చేసింది హైకోర్టు.

ఈలోపే సుజనాచౌదరి లుకవుట్‌ నోటీస్‌ వ్యవహారం మీడియాలో కోడై కూయటంతో సారువాడి తలకొట్టేసినట్లు అయ్యింది. అయితే ఈ నోటీసు కొత్తదేం కాదంటున్నారు సుజనాచౌదరి. బిడ్డపోయినా పురిటికంపు పోనట్లు.. ఎప్పుడో రెండేళ్ల క్రితం జారీఅయిన లుక్‌ అవుట్‌ నోటీసని చెబుతున్నారు. ఎయిర్‌.పోర్టులో తనను ఎవరూ ఆపలేదని, పాత లుకవుట్‌ నోటీసును రద్దు చేయించేందుకే కోర్టును ఆశ్రయించానంటున్నారు సుజనాచౌదరి. బ్రేకింగ్‌ న్యూస్‌.లిచ్చిన టీవీ ఛానెళ్లపై ఆయన గుర్రుమన్నా…జరిగిందంతా బయటి ప్రపంచానికి తెలిసిపోయింది.

టీడీపీ ఎంపీగా ఉండగానే సుజనాచౌదరిపై ఎన్నో ఆరోపణలొచ్చాయి. ఆయన కుంభకోణాలు బయటికొచ్చాయి. సుజనా గ్రూపు సంస్థలు బ్యాంకులకు 5వేల 700 కోట్ల కుచ్చుటోపీ పెట్టాయ‌ని ఎన్‌ఫోర్స్‌.మెంట్‌ డైరెక్టరేట్‌ నిగ్గుతేల్చింది. భారీ మొత్తంలో బ్యాంకుల‌కు సుజనాచౌదరి ఎగవేశారనేందుకు తగిన సాక్ష్యాధారాలు దొరికాయని ప్రకటించింది ఈడీ. సుజనా గ్రూప్‌ సంస్థలపై ఫెమా, డీఆర్‌ఐ, సీబీఐ కేసులు నమోదయ్యాయి.

ఆ టైంలోనే లుకవుట్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. పోయినేడాది డిసెంబరులో సుజనాచౌదరి భార్య పద్మజతో పాటు 9మందికి డీఆర్టీ నోటీసులు కూడా ఇచ్చింది. 169 కోట్ల రుణాలకు సంబంధించి ఆ నోటీసులు జారీఅయ్యాయి. టీడీపీ అధికారం కోల్పోగానే సేఫ్‌ సైడ్‌.గా బీజేపీలో చేరారు సుజనాచౌదరి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నీడన ఉండటంతో ఇక రిస్క్‌ లేదని అనుకుంటే…పాత స్కామ్‌.లు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. బీజేపీలో ఉన్నాడని ఆయన్ని వెనకేసుకొచ్చి అపనిందలు కొనితెచ్చుకునేందుకు సిద్ధంగా లేదు పార్టీ నాయకత్వం. దీంతో కండువామార్చినా కుడితిలో పడ్డ ఎలుకలాగే ఉంది సుజనాచౌదరి పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here