Home News Politics

టీడీపీకి కడపలో వరుస షాక్ ల ఎఫెక్ట్…!

ఎన్నికల సీజన్‌ దగ్గర పడుతుండటంతో .. కడప జిల్లా రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి .. టికెట్‌ ఆశావహులు తమ లెక్కలు తాము వేసుకుంటూ పార్టీలు మార్చేస్తున్నారు.. దాంతో ఎవరు? ఎప్పుడు? ఏ పార్టీలో ఉంటారో అర్థం కాకుండా తయారవుతోంది .. ఆ క్రమంలో తాజాగా టిడిపి మాజీ మంత్రి ఖలీల్‌బాషా వైసీపీ బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది…

కడప జిల్లా రాజకీయం అందరిలో ఆసక్తి రేపుతోంది.. అక్కడ చకచకా చోటుచేసుకుంటున్న పరిణామాలు జిల్లా పొలిటికల్‌ ముఖచిత్రాన్ని మార్చేస్తున్న పరిస్థితి.. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చినా కడప జిల్లాలో టీడీపీకి దక్కింది ఒక్క సీటే.. దాంతో జిల్లా పై స్పెషల్‌ కన్సన్‌ట్రేషన్‌ పెట్టింది అధికారపక్షం … వైసీపీలో బలమైన నేతగా ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి పసుపు కండువా కప్పి మంత్రి పదవి కట్టబెట్టింది … జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలోనూ వైసిపికి షాక్‌ ఇచ్చింది.. ఆ ఎఫెక్ట్‌తో మరికొందరు వైసీపీ నేతలు,బద్వేలు ఎమ్మెల్యే టీడీపీ బాట పట్టారు…

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీ సైతం కౌంటర్‌ అటాక్‌ మొదలుపెట్టింది.. జిల్లాలో టీడీపీ టికెట్‌తో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి వైసీపీ పంచకు చేరారు.. తాజాగా సీనియర్ టీడీపీ నేత, మాజీమంత్రి ఖలీల్ బాషా వైసీపీ లో చేరడం .. జిల్లాలో ముస్లిం మైనార్టీ వర్గాల పరంగా ఆ పార్టీకి ప్లస్‌ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది …

కడప నగరంలో ప్రముఖ వైద్యుడు గా ఉన్న ఖలీల్ బాషా 1994 ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు… కడప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి కేబినెట్‌ బెర్త్‌ కూడా దక్కించుకున్నారు .. 1999 ఎన్నికల్లో కూడా రెండోసారి విజయం సాధించి మరోసారి మంత్రి పదవి దక్కించుకున్నారు…అయితే 2004 ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కలేదు.. దానిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా ఆయన టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు..

2004 నుంచి ప్రతి ఎన్నికలో టికెట్ కోసం పోటీపడటం.. అది దక్కకపోవడంతో ఖలీల్‌బాషాలో అసంతృప్తి లెవల్స్‌ పెరిగిపోయినట్లు కనిపించాయి.. కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నా.. టీడీపీ టికెట్‌ పరంగా ఎలాంటి సానుకూల పవనాలు కనిపించలేదంట.. ఈ పరిస్థితి గమనించిన వైసీపీ నేతలు స్ధానిక ఎమ్మెల్యే అంజాద్ బాషా , కడప మేయర్ సురేష్ బాబులు రంగంలోకి దిగి … ఖలీల్‌బాషాతో చర్చలు జరిపి వైసీపీలో కి ఆహ్వానించారు .. ఏదేమైనా అధికార, ప్రతిపక్షాల్లో జరుగుతున్న వలసల రాజకీయంతో కడప జిల్లా రాజకీయం రంజుగా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here