Home News

రఘురామరాజూ విషయంలో అతిగా స్పందించి టీడీపీ తప్పు చేసిందా ?

టీడీపీ తన రాజకీయ సమస్యలతోనే ఊ పక్క తాను సతమతమవుతుంది. వాటిని తీర్చుకోవడమే చంద్రబాబుకి గగనంగా మారిన సమయంలో పక్క పార్టీ వ్యవహారంలో ఎక్కువ తలదూర్చి తప్పు చేసిందా అన్న భావన వ్యక్తమవుతుంది. వైసీపీలో జగన్ కి ఎంపీ రఘురామ కృష్ణం రాజు కి మధ్య విభేధాలు వచ్చాయి. రఘురామ రాజు రెచ్చిపోయి ప్రభుత్వం పై విమర్ష్షలు చేస్తున్నారు..రఘురామరాజు ఆ స్థాయి విమర్షలు చేయడం వెనుక టీడీపీ నేతలు వారి అనుకూల మీడియా హస్తం ఉందా అన్న రీతిలో టీడీపీ ఉలికిపాటు ఇప్పుడు ఆ పార్టీనే డిఫెన్స్ లో పడేసింది.

ఇపుడు టీడీపీ పెద్దలతో పాటు అనుకూల మీడియా రఘురామరాజు అరెస్ట్ గురించి గుండెలు బాదుకుంటూంటే నిజమేనని వారికి వారే చెప్పేసుకున్నట్లు అయింది అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ సైలెంట్ గా ఉండి సుతిమెత్తగా విమర్షలు చేస్తే అది జగన్ కే మైనస్ గా మారేదన్న చర్చ నడుస్తుంది. అప్పట్లో కాంగ్రెస్ లో జగన్ కి హై కమాండ్ కి మధ్య ఇలాగే విభేదాలు వచ్చాయి. అది వారి అంతర్గత వ్యవహారం. కానీ మధ్యలో చంద్రబాబు టీడీపీ దూరిపోయి జగన్ కధను జైలు దాకా తెచ్చార‌ని చెబుతారు. ఫలితంగా జగన్ పెద్ద నాయకుడిగా మారి టీడీపీనే ఏపీలో దెబ్బ తీశారు. అది తెలిసి కూడా సంబంధం లేని విషయాల్లో ఎక్కువ చోరవ చూపి సమస్యకు అసలు కారణం తామే అన్న భావన తీసుకెళ్లినట్లైంది. రఘురామరాజుని టీడీపీ అండ్ కో మీడియా కలిసి ఇలా మాట్లాడేలా చేశాయన్న భావన ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లింది.

రఘురామ రాజుకి జగన్ కి గొడవ అయితే వెనక టీడీపీ ఉంది అన్న అభిప్రాయాలు బలపడేలా భారీ మద్దతు ఇస్తూ వస్తున్నారు. దీని వల్ల రాజు వివిధ సామాజిక వర్గాలను, కొన్ని మతాలను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కి కూడా టీడీపీ బాధ్యత వహించాల్సి వస్తోందని అంటున్నారు. ఏపీలో రెడ్డి సామాజికవర్గాన్ని రాజు విమర్శించారు అని వీడియో సహితంగా సీఐడీ ఆధారాలు సంపాదించింది. వాటిని చానళ్ళలో కూడా మళ్ళీ ప్రసారం చేస్తున్నాయి. ఇక ఒక మతాన్ని కూడా ఆయన పనిగట్టుకుని టార్గెట్ చేశారు అంటున్నారు. మరి ఆ మతాల వారు కులాల వారు ఇపుడు రాజుకు మద్దతుగా నిలుస్తున్న టీడీపీ మీద కూడా గుస్సాగా ఉన్నారు. చివరికి అంతమీదేసుకుని రాష్ట్రపతికి లెటర్ల వరకు చంద్రబాబు స్పీడు పెంచారు.

మొత్తానికి సొంత పార్టీని చక్కదిద్దుకోకుండా అనవర విషయాల్లో అతిగా చొరవ చూపి చంద్రబాబు పార్టీలో కొత్త సమస్యలకు కారణమవుతున్నారా అన్న చర్చ నడుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here