Home News

నిజంగానే టిడిపి జూమ్ పార్టీగా మారిపోతుందా…!

ఏపీలో టీడీపీ తీరు పై పెద్ద చర్చే జరుగుతోంది. రాష్ట్రంలో సమస్యలపై చిన్న పార్టీలు సైతం రోడ్డెక్కుతున్నా..ప్రధాన ప్రతిపక్షం మాత్రం ప్రకటనలకే పరిమితం అవుతుందనే వాదన వినిపిస్తుంది. కోవిడ్ కారణం అని చెపుతున్నా..పార్టీ లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యడంలో ప్రధాన ప్రతిపక్షం నామమాత్రంగా మారిపోయింది. బలమే లేని వామపక్షాలు..బీజేపీ నిరసనలకు దిగుతున్నా..టీడీపీ మాత్రం కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షంలో స్థబ్దత పార్టీ నేతలనే ఆలోచనలో పడేస్తుంది.

రాష్ట్రంలో ధాన్యం సేకరణ, రైతులకు చెల్లింపుల విషయంలో తీవ్ర ఆందోళన ఉంది. ఈ సమస్యపై బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసింది. కోవిడ్ కారణంగా తమతమ కార్యాలయాలనుంచే నిరసన చేపట్టారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఎంతో కొంత కదలిక తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక మరోవైపు ఆస్తి పన్ను వంటి వాటిపై వామపక్షాలు గట్టిగానే ఫైట్ చేస్తున్నాయి. ఎపి పట్టణ పౌర సమాఖ్యపేరుతో సిపిఎం నేత దీన్నోఉద్యమంలా చేపట్టారు. అన్ని జిల్లాలు పర్యటించి నిరసనలు చేపట్టారు. ఇలా చిన్ని చిన్న పార్టీలు, బలం లేని పార్టీలు సైతం ప్రజల సమస్యపై పోరాటం చేస్తున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఆ స్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు.

ఏపీలో బలమే లేని వామపక్షాలు..బిజెపి నిరసనలకు దిగుతున్నా….టిడిపి మాత్రం కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షంలో స్థబ్దత పార్టీ నేతలనే ఆలోచనలో పడేస్తుంది. పైకి కోవిడ్ అని చెపుతున్నా..ఇతర అంశాలే ప్రధాన కారణం అనే చర్చ జరుగుతుంది. పార్టీలో పరిస్థితులు చూడకుండా లెక్కుకు మించి ప్రోగ్రాం ఇచ్చే సంస్కృతి ఉంది. దీంతో అధిష్టానం ఏం చెప్పినా ఎప్పుడూ ఉండేదేగా అంటూ నేతలు లైట్ తీసుకుంటున్నారు. పార్టీ నిరసనలకు పిలుపునిస్తున్నా చాలా మంది వీటిని పెద్దగా పట్టించుకోలేదు. నేతలంతా మీడియా సమావేశాల్లో ప్రభుత్వాన్ని తిట్టడానికి తప్ప నిజంగా రోడ్డెక్కి పోరాటం చెయ్యడానికి సిద్దంగా లేరనేది తెలిసిపోతుంది. అధిష్టానం పిలుపు ఇచ్చినట్లే ఏ కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరగడం లేదు.

ఇక ధాన్యం సమస్యపై ప్రదాన ప్రతిపక్ష టిడిపి కంటే బిజెపినే కాస్తో కూస్తో గట్టిగా ఫైట్ చేసింది. ప్రతి అంశానికి జూమ్ పై ఆధార పడడం పెద్ద నష్టమే చేస్తుందని పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉండడంపైనా విమర్శలు ఉన్నాయి. మరోవైపు అంతా బాగా చేశారు అనే సొంత డబ్బాతో కాలం గడిపేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here