ఏపీ టీడీపీలో విషాదం నెలకొంది. కరోనాతో బాధపడుతూ టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖలోని అరిలోవా అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా తో పాటు సబ్బం హరికి ఇతరాత్ర ఆరోగ్యసమస్యలు ఉండటంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.

1995 విశాఖ మేయర్ ఎన్నికల్లో పోటి చేసిన సబ్బంహరి చిన్న వయసులో మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అవినీతి ఆరోపణలు లేకుండా మేయర్‌గా పరిపాలన కొనసాగించారు. విశాఖ కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా.. అనంతరం నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా సబ్బం నియామకమయ్యారు. సబ్బంకు కుమారుడు,ఇద్దరు కుమార్తెలున్నారు. 2009లో సీఎం వైఎస్ఆర్ అనకాపల్లి ఎంపీగా అవకాశం కల్పించడంతో పీఆర్పీ అభ్యర్ది అల్లు అరవింద్ పై ఘనవిజయం సాధించారు. వైఎస్ మరణం ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వైసీపీ అధినేత జగన్ కి అండగ నిలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి గత ఎన్నికల్లో భీమిలీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.