Home News

టీడీపీలో పెరుగుతున్న మాజీల సంఖ్య..త్వరలో వీరి పదవులు కూడా గాయబ్

టీడీపీలో ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా కనుమరుగవుతుంది. 2014 ఎన్నికల తర్వాత పదవులతో నిండుకుండలా ఉన్న పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయిదవ వంతుకు పైగా పదవులు కోల్పోయింది. దాంతో పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో తేలారు. వారికి తోడు అన్నట్లుగా గత రెండేళ్లలో రాజ్య సభ్య సభ్యులు, శాసన మండలి సభ్యులు మాజీలు అయ్యారు. ఇక తాజాగా మరికొందరు మాజీలు కాబోతున్నారు.

టీడీపీ పార్టీ ఇపుడు మాజీలకు నిలయంగా మారుతోంది. పార్టీలో కాస్తా వాయిస్ వినిపించే ఎమ్మెల్సీలు కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. అనకాపల్లి నుంచి ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు పదవీ కాలం ఈ నెల 18తో పూర్తి అయిపోతోంది. ఆయన బాబుకు అండగా ఉంటూ వైసీపీ మీద గట్టిగా విరుచుకుపడే నేతగా గుర్తింపు పొందారు. మరో ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు కూడా రిటైర్ కాబోతున్నారు. ఆయన కూడా ఇదే నెలలో మాజీ ఎమ్మెల్సీ కాబోతున్నారు.

విజయనగరం జిల్లాలో బీసీ నేతగా మాజీ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న ద్వారపురెడ్డి జగదీష్ కూడా మాజీ ఎమ్మెల్సీ కాబోతున్నారు.ఇక ఉత్తరాంధ్రాలో తిప్పి తిప్పి చూస్తే ఇద్దరు నేతలు మాత్రమే టీడీపీకి పెద్దల సభలో మిగిలారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల కోటాలో నెగ్గిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, అలాగే విశాఖ నుంచి బీసీ నేత దువ్వారపు రామారావు మాత్రమే ఉన్నారు. ఇందులో శత్రుచర్ల 2023లో రిటైర్ అవుతారు. దువ్వాడ పదవీకాలం 2025 దాకా ఉంది. దువ్వారపు పార్టీ వాయిస్ పెద్దగా వినిపించింది లేదు. టీడీపీకి మళ్ళీ ఆ స్థాయి పదవులు దక్కాలంటే 2024 వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here