Home News Stories

మళ్ళీ అవే తప్పులు…వీళ్ళు మారరా…?

తప్పుల మీద తప్పులు… మళ్లీ అవే తప్పులు… ఒకసారి దెబ్బతింటే… తిరిగి పునరావృతం కాకుండా చూసుకుంటారు ఎవరైనా.. రాజకీయ పక్షాలైతే ఆ విషయంలో మరీ అప్రమత్తంగా వ్యవహరిస్తుంటాయి.. అయితే అక్కడ మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.. తామెక్కిన పుట్టి మునిగిపోతున్నా పెద్ద నష్టం ఏమీ లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు టీ కాంగ్రెస్‌ నేతలు.. ఎన్ని దెబ్బలు తగిలినా అసలు నొప్పే లేనట్లు కానిచ్చేస్తున్నారు .. అంత వెరైటీగా వ్యవహరిస్తున్న పార్టీ పెద్దల పై సోంత పార్టీ శ్రేణులే తెగ సెటైర్లు విసురుతున్నాయి…

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత .. కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది అనుకున్నారు… అది జరగలేదు .. ఎన్నికలు ముగిసి వలసల పర్వం మొదలైనా పార్టీ పెద్దలకు చీమకుట్టినట్టు కూడా లేదని సెటైర్లు విసురుతున్నాయి పార్టీ శ్రేణులు .. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కూడా వారి వ్యవహారం మునుపటిలానే ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుండి మొదలు కొని… ప్రచారం వరకు..అంతా అగమ్యగోచరంగా మారిపోయింది కాంగ్రెస్‌లో … ఉదాసీనతతో పదేపదే అదే తప్పులు చేస్తున్నారన్న విమర్శలు పార్టీ పెద్దల చెవికెక్కుతున్నట్లు కనిపించడం లేదు … దాంతో ఇప్పటికే ఒకవైపు ఎమ్మెల్యే లు చేజారిపోతున్నారు … అభ్యర్థుల జాబితా వచ్చాక… ఎంపికలో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపుతూ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.

అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఎంత కసరత్తు చేసిందో కానీ…కొంప కొల్లేరు చేసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది … ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ ఎంపికను వ్యతిరేకిస్తూ… నరేష్ జాధవ్ పార్టీకి రాజీనామా చేశారు… అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన రమేష్ రాథోడ్ కి… కాంగ్రెస్‌ ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ టికెట్ ఇచ్చింది… ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు ఇప్పుడు వెంటనే పార్లమెంట్ సీటు కూడా ప్రకటించింది… అదే ఇప్పుడు కాంగ్రెస్ నేతల రాజీనామాలకు దారి తీస్తోంది… ఎన్నికలకు ముందు వచ్చి చేరిన వారికి .. వెంటవెంటనే రెండు అవకాశాలు ఇవ్వటం ముందు నుంచి పార్టీని నమ్ముకున్న వారికి మింగుడుపడటం లేదు…

రాజధానిలో గిరిజన ప్రాతినిధ్యం ఉన్న సీట్లు రెండే… ఎస్టీ రిజర్వ్‌డ్‌ అయిన ఆదిలాబాద్… మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలు… ఆదివాసీల ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ .. సీట్ల వ్యవహారంలో మాత్రం ఈ సారి తప్పటడుగువేసింది… అదివాసీ, లంబాడీ లకు ఒక్కో సీటు ఇవ్వాలని తొలుత లెక్కలు వేసారు పిసీసీ పెద్దలు .. అయితే ఆఖరికి… రెండు సీట్లు లంబాడా నేతలకే ఖరారు చేశారు .. . దీంతో ఎప్పటినుంచి రాజకీయ ప్రాధాన్యత కోసం పోరాడుతున్న ఆదివాసీలు ఎంత వరకు సహకరిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి …

పెద్దపెల్లి అభ్యర్థి ఎంపికపై కూడా కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్‌ని మాజీమంత్రి చంద్రశేఖర్ కి కేటాయించారు .. వికారాబాద్ కి చెందిన చంద్రశేఖర్‌ని పెద్దపల్లికి పంపటం వెనుక లాజిక్ ఏంటన్నది పెద్ద డిబేట్‌ అయి కూర్చుందిప్పుడు .. పెద్దపల్లి లో కాస్తో..కూస్తో…కాంగ్రెస్‌కి బలం ఉంది… అయితే ఇప్పుడు కొత్త అభ్యర్ధిని బరిలో పెట్టి కాంగ్రెస్ ఏం సాధించదలుచుకుందో అర్థం కావటం లేదంటున్నారు కరీంనగర్ జిల్లా నాయకులు. .. ఇలా వరుసగా లాజిక్‌ లేని నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్‌ పెద్దల లాజిక్‌ ఏంటో వారికే తెలియాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here