Home News

టీ కాంగ్రెస్ లో పీసీసీ చిచ్చు..పోటి పడుతున్న మూడు గ్రూపులు..!

తెలంగాణ కాంగ్రెస్‌లో పిసిసి చిచ్చు రాజుకుంటుంది. పిసిసి పదవి ఆశిస్తున్న వారంతా గ్రూపులుగా విడిపోయారు. అధిష్టానానికి మాత్రం ఇప్పటికే ఓ నివేదిక వెళ్లిందనిఈ వారంలో ప్రకటన కూడా వచ్చేస్తుందని ధీమాలో ఓ వర్గం ఉంది. పార్టీ సంగతి ఎలా ఉన్నా పిసిసి పంచాయతీ మాత్రం కాంగ్రెస్‌ని చీలికలు పీలికలుగా మార్చేసింది. పిసిసి నియామకం కంటే ముందే పరిస్థితి ఇలా ఉంటే..నియామకం జరిగితే ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో అని పార్టీలో చర్చ నడుస్తుంది.

పీసీసీ చీఫ్ పదవి కావాల్సిందేనని పట్టు పడుతున్న వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి..రేవంత్ రెడ్డి ముందున్నారు. ఇక నాక్కూడా పిసిసి కావాలని అడిగే వారిలో వీహెచ్‌..జగ్గారెడ్డి కూడా ఉన్నారు. ఐతే..మనసులో పీసీసీ కావాలని ఉన్నా..బయటకు మాత్రం చెప్పరు. ఉత్తమ్ రాజీనామా చేసినప్పటి నుండి అభిప్రాయ సేకరణలో మెజారిటీ నాయకులు రేవంత్ పేరే ప్రతిపాదించారు. దీంట్లో మాజీ మంత్రులు..మాజీ ఎంపీలు ఉన్నారు. ఈ టీం అంతా ఇప్పటికే చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇక పీసీసీ ఆశిస్తున్న మరో నాయకుడు ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎన్ఎస్ యూఐ నుంచి పని చేస్తూ వస్తున్నానని తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని…జనంలో తనకే ఆమోదం ఉంటుందని కోమటిరెడ్డి మద్దతుదారులు చెప్తున్నారు. బీసీలకు పిసిసి అవకాశం లేకుంటే కనీసం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి పదవి ఇవ్వండి అని వీహెచ్ లాంటి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. రేవంత్‌ని వ్యతిరేకించే టీంలో కొందరు కోమటిరెడ్డికి మద్దతు ఇస్తున్నారు.

మరోవైపు వీరికి తోడు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పిసిసి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఐతే..అది తన కోసం కాదు శ్రీధర్ బాబు కోసం అనే వార్తలు వినిపిస్తున్నాయ్. ఇద్దరిలో ఎవరికో ఒకరికి పిసిసి ఇవ్వండి..కాంగ్రెస్ కుటుంబం నుండి వచ్చిన వారు కాబట్టి పార్టీకి లాయల్‌గా ఉంటారని ఓ టీం పని చేస్తోంది. భట్టీ పైకి పీసీసీపై ఆసక్తి లేదని చెబుతున్నా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారనే భట్టి వ్యతిరేక టీం ప్రచారం చేస్తోంది. ఇలా పార్టీ పిసిసి పదవి ఆశిస్తున్న వారంతా గ్రూపులుగా విడిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here