Home News Updates

తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఘన విజయం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ప్రత్యర్థి పార్టీల తరపున హేమాహేమీలు ప్రచారం నిర్వహించినా..చివరకు డీఎంకే-కాంగ్రెస్‌ కూటమినే విజయం వరించింది. ఇంట గెలిచిన స్టాలిన్‌ను రచ్చ గెలిపిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చారు. దీంతో డీఎంకేలో కరుణానిధి తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టబోయే మొదటి వ్యక్తిగా స్టాలిన్ తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సుస్థిరం చేసుకోనున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపులో ఆ పార్టీ అధినేత స్టాలిన్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి విశేష కృషి చేశారు. ఒక‌వైపు బ‌హిష్కృత నేత‌, త‌న సోదరుడు అళ‌గిరి నుంచి ఎప్పటిక‌ప్పుడు ఎదుర‌య్యే తిరుగుబాటును స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నారు. మ‌రోవైపు అస‌మ్మతి నేత‌ల‌ను బుజ్జగిస్తూ పార్టీని ఒక్క తాటిపై న‌డిపించారు. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యానికి కార‌ణ‌మ‌య్యారు స్టాలిన్.

ఇక ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు విష‌యంలోనూ స్టాలిన్ చాలా జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్‌ను త‌మ కూటమిలో ఉండేందుకు చివ‌రివ‌ర‌కు ప్ర‌య‌త్నించారు. ఆ పార్టీ అడిగిన‌న్ని సీట్లు ఇవ్వ‌క‌పోయినా..రెండు పార్టీల‌కు ప్రయోజ‌నం క‌లిగే విధంగా సీట్లు స‌ర్దుబాటు చేయ‌డంలో స్టాలిన్ కీల‌క‌పాత్ర పోషించారు. చివ‌రికి పార్టీని గెలిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here