Home News Stories

కంచుకోటలో పట్టు నిలుపుకునేనా…!

సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తంబ‌ళ్ల‌ప‌ల్లి. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్ని క‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన శంక‌ర్‌ యాదవ్ వైసీపీ అభ్యర్ధి ప్రవీణ్ కూమార్ రెడ్డి పై విజయం సాదించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన ప్రవీణ్ తర్వాత వైసీపీలో చేరి అక్కడ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడి పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత ఇక్కడ పెద్దిరెడ్డి సోదరుడు ద్వారాకనాథ్ రెడ్డి వైసీపీ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నే వైసీపీకి ప్లస్ అన్న ఆసక్తికర స్ట్రాటజీ నడుస్తుంది. మరోవైపు ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళి టిక్కెట్ రేసులో ఉండటంలో తంబాళ్ల‌పల్లి రాజకీయం రసవత్తరంగా మారింది…

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఓటమి పాలైన శంకర్ యాదవ్ టీడీపీలో చేరి 2014లో పోటీ చేయాగా… టీడీపీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపోందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తర్వాత వైసీపీలో చేరారు. త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో శంక‌ర్ టీడీపీలోకి రాగా.. ప్ర‌వీణ్ మాత్రం వైసీపీ టికెట్‌పై పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో శంకర్ యాదవ్ చేతిలో పదివేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ప్రవీణ్. ఈ ఐదేళ్లలో శంకర్ పర్ఫామెన్స్ చూస్తే అభివృద్ది అంతంతమాత్రమే కాగా వ‌ర్గ పోరు దీనికి తోడైంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గం అంతా కూడా ఇప్పుడు శంక‌ర్‌కు వ్య‌తిరేకంగా మారిపోయింది. యాద‌వ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ శంక‌ర్‌కు ఇక్క‌డ మ‌ద్ద‌తిచ్చేవారు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. దీంతో టీడీపీ అధిష్టానం కూడా ఆలోచ‌న‌లో ప‌డింది.

ఇక్కడ పరిస్థితి పై అంచానకొచ్చిన టీడీపీ అధిష్టానం శంకర్ ని పక్కనపెట్టి మాజీ ఎమ్మెల్యేలు అయిన ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డి లేదా ల‌క్ష్మీదేవ‌మ్మ‌ల‌లో ఎవ‌రో ఒక‌రికి సీటు ఇచ్చే అంశంపై కూడా చంద్ర‌బాబు ఆలోచ‌న చేస్తున్నారు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ యాదవ్ ను మార్చగలరా అనే ప్రశ్న కూడా వస్తుంది. స్థానికంగా శంకర్ అందుబాటులో లేక పోవడంతో పాటు నీరు చెట్టులో జరిగిన అవినీతి,పీఏలు ఎక్కువ కావడం కూడా అతనికి ఇబ్బందిగా మారింది.ఇక్కడ రెడ్డి ఓట్లు కీలకం,అయితే రెడ్లలో రెండు గ్రూపులు వుంటాయి.తంబల్లపల్లికి చెందిన పారిశ్రామిక వెత్త మలిగె మదు సూదన్ రెడ్డి కూడా టీడీపీ నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. జనసేన నుంచి విశ్వం విద్యాసంస్థల అదినేత ప్రభాకర్ రెడ్డి బరిలో దిగే చాన్సుంది. ఇక బిజెపి నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి వైకాపాలో చేరతాడనే ప్రచారం వుంది.కాంగ్రెస్ నుంచి సుదాకర్ మరోసారి పోటీ చేయనున్నారు. ఇక్కడ రెడ్డి ,మైనార్టీ,బిసి సామాజిక వర్గాల వారు కీలకం.

పైకి మాత్రం శంకర్‌ యాదవ్‌ టిక్కెట్‌ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఇంచార్జ్ మంత్రి అచ్చ‌న్న హామీ అయితే ఇచ్చారు. కానీ, వాస్త‌వ ప‌రిస్థితిలో మాత్రం శంక‌ర్‌కు మ‌ళ్లీ టికెట్ ఇస్తే.. ఇక్క‌డ టీడీపీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌నే స‌మాచారం ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు తుది నిర్ణ‌యం ఎలా ఉంటుందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీలో కూడా ఎంఎల్ఎ శంకర్ యాదవ్ పట్ల మెజార్టీ వర్గం వ్యతిరేకిస్తుంది.దీంతో మాజీ ఎంఎల్ఎ లక్ష్మి దేవమ్మతో పాటు అమె కూమారుడు ప్రవీణ్ కూమార్ రెడ్డి లను తిరిగి బరిలో దింపుతారనే ప్రచారం జరుగుతుంది. ఇక వైసీపీ నుంచి జిల్లాలో కీలకనేత పెద్దిరెడ్డి సోదరుడు బరిలో దిగుతుండటంతో ఈ ఎన్నిక వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.

ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టీడీపీ చాన్సిస్తే అదే వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందన్న ట్రెండ్ నడుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here