Home News

ఆ సీనియర్లు హస్తం పార్టీలో ఎక్కడ…!

తెలంగాణ కాంగ్రెస్లో కీలకంగా పనిచేసి.. పదవులు అనుభవించిన నాయకులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు… ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లు… రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కనీసం స్పందించడం కూడా లేదు … పోనీ పార్టీ విషయాలైనా ప్రస్తావిస్తున్నారా? అంటే అదీ లేదు… వీళ్లంతా ఎందుకు సైలెంట్‌ అయిపోయారు? … అసలు ఏం జరుగుతోంది?


తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు జానారెడ్డి… తెలుగురాష్ట్రాల్లో రికార్డు కాలం మంత్రిగా కొనసాగిన నేత… అలాంటాయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత… మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారో ఏమో కాని … పలుకే బంగారం ఆయనే … అన్నట్లు వ్యవహరిస్తున్నారు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై… ఆయన మౌనంగా ఉండటమే కాదు అసలు కనిపించడమే గగనంగా మారింది…


రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పై… జానారెడ్డి ఇప్పటి వరకు నోరు మెదపలేదు… ఇంకొందరు కాంగ్రెస్ కీలక నాయకులు కూడా దీనిపై కొంత కన్ఫ్యూజన్‌తోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు.. కాళేశ్వరం గురించి ఏమన్నా మాట్లాడినా … లీగల్‌గా ప్రొసీడ్‌ అయినా.. జనం ఏమనుకుంటారో అన్న భయంతో వారు ఉన్నట్లు కనిపిస్తున్నారు.. మధ్యలో అడ్డుకుంటున్నారు అనే చర్చకు ఎందుకు అవకాశం ఇవ్వాలి అన్న భావన వారిలో కనిపిస్తోంది

Indian Congress party leaders (L-R) Komati Reddy Venkat Reddy, Sunitha Lakshma Reddy, Geetha Reddy, K. Jana Reddy, K. Keshava Rao, Ponnala Lakshmaiah and others from the Telangana region of Andhra Pradesh state participate in a 48-hour hunger strike in support of a separate state of Telangana at Indira Park in Hyderabad on July 13, 2011. Eleven members of parliament and 40 members of assembly belonging to Congress party had submitted their resignations last week. A total of 15 MPs and 100 legislators of various parties from the telangana region have submitted their resignation demanding the separate state of Telangana. AFP PHOTO / Noah SEELAM (Photo credit should read NOAH SEELAM/AFP/Getty Images)

అలా అని స్పందించకుండా ఉండలేరు… ఇలాంటి సంక్లిష్ట సమయంలో చాలా మంది సీనియర్లు ఉన్నా… పార్టీకి దశ, దిశ చూపాల్సిన సీనియర్ నేత జానారెడ్డి… మౌనంగా ఉండిపోయారు. నియోజకవర్గం పార్టీ శ్రేణుల పిలిస్తే తప్పితే… అయన కనిపించడం మానేసారు … ఓడిపోతే ఇంటికే పరిమితం కావాలనుకున్నారా..? ప్రస్తుత పరిస్థితుల్లో తమకు దిశాదిర్ధేశం చేసేదెవరని ప్రశ్నిస్తున్నాయి పార్టీ శ్రేణులు.. మౌన మునిగా ఉండటం కంటే…పనిలో పడితే బాగుంటుంది అనేది చాలా మంది సీనియర్లు ఒపీనియన్. .. ఒకవైపు జానారెడ్డి సైలెంట్‌గా ఉంటుంటే … ఆయన కుమారుడేమో పార్టీ మారతారన్న ప్రచారం చర్చనీయాశమవుతోంది


జానారెడ్డే కాదు… అటు సీనియర్ నాయకుడు దామోదర రాజనర్సింహ కూడా అంతే.. పీసీసీ పని తీరు మీద ఆ మాజీ డిప్యూటీ సీఎం కొంత అసంతృప్తితో ఉన్నారు… ఇప్పుడున్న నాయకత్వం తో అయ్యేది లేదు.. పొయ్యేది లేదనే ఫిలింగ్ లో ఉన్నారంట దామోదర… పార్టీ సమావేశాలు ఉంటే తప్పితే…బయట కనపడటం మానేశారు… నియోజకవర్గానికే పరిమితమై తన పని తాను చేసుకుంటున్నారంట.. కొంత అగ్రెసివ్ గా ఉండే నాయకులు ఇలా మౌనంగా ఉంటే .. పార్టీ పరిస్థితి ఏంటో వారికే తెలియాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here