Home News Updates

ఎన్నికల్లో గెలవడం, నాయకులను కొనడం పైనే కేసీఆర్ ఫోకస్

రాష్ట్రంలోని కరోనా బాధితుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ‘సత్యాగ్రహ దీక్షలు’ చేపట్టింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేకనే ఈ పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు టీ కాంగ్రెస్ నేతలు. ఈపరిస్థితి కారణం ప్రధాని మోడీ ,సీఎం కేసీఆరే అన్నారు ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి. గతేడాది అసెంబ్లీ లో భట్టి విక్రమార్క అడిగితే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని అడిగితే ఒప్పుకున్నాడు..9నెలలు అవుతున్న ఇప్పటికి అమలుకు నోచుకోలేదన్నారు. ఎన్నికల్లో గెలవడం, నాయకులను కొనడం పైనే కేసీఆర్ దృష్టి ఉందన్నారు. మనసు లేని మృగం లాగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడు అని దుయ్యబట్టారు.

రాష్ర్టంలో భయంకర పరిస్థితులు ఉన్నాయన్నారు సీఎల్పీ నేత‌ భట్టీ. ప్రపంచ దేశాలు ఇండియా నుండి వచ్చే వారిని రానివ్వటం లేదు అని గతేడాది దీపాలు పెట్టండి చప్పట్లు కొట్టండి అంటూ ప్రధాని చెప్పారు. ఇంట్లో దీపం ఆర్పేసి భయట దీపాలు పెట్టండి అంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి తీరు కూడా అలాగే ఉందన్నారు. రాష్ట్రంలో ఇన్ని మరణాలకు సీఎం కేసీఆరే కారణం అన్నారు భట్టీ. కరోనా భారిన పడి10 లక్షల కుటుంభాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వైద్యం ఉచితంగా అందించమంటే రక్త పరీక్షలు ఉచితంగా చేస్తామంటున్నారు..బ్లాక్ ఫంగస్, కరోనా వైద్యం ఉచితంగా అందించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here