Home News

కాంగ్రెస్ ను బజారుకీడుస్తున్న పీసీసీ పంచాయతీ

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ నియామకం కాక రేపుతోంది. పార్టీనే ధిక్కరించే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఏ పార్టీలో అయిన నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటడం సహజమే. అది పార్టీకి మంచి చేసేందుకే ఉపయోగపడాలి. ఐతే కాంగ్రెస్‌లో నాయకుల సిగపట్లు…పార్టీని మరింత బజార్లోకి లాగుతున్నాయ్‌. కాంగ్రెస్ కష్టాల నుంచి బయటకు తీసుకురావడం ఎలా అనేది మానేసి…పీసీసీ కోసం పంచాయతీ మొదలు పెట్టారు కొందరు టీ కాంగ్రెస్ నేతలు.

తెలంగాణ పీసీసీ చీఫ్‌ నియామకం వేళ కొందరు నేతలు ఇంకా పేట్రేగిపోతున్నారు. పార్టీ వేదికల మీద చర్చించే విషయాలు..ఓపెన్ కావడంతో వివాదం మొదలవుతుంది. పీసీసీ చీఫ్ పదవికి రేవంత్ అనర్హుడు ఆయనకు ఎలా ఇస్తారంటూ సీనియర్ నాయకుడు వీహెచ్‌ కామెంట్ చేశారు. దానిపై మళ్లీ రచ్చ మొదలైంది. రేవంత్‌కి పీసీసీ ఇవ్వకూడదు అనుకుంటే అధిష్టానానికి చెప్పుకోవచ్చు. బహిరంగంగా కామెంట్స్‌ చేసి అగ్గి రాజేశారు. రేవంత్‌కి ఇవ్వొద్దని కొందరు అంటే..రేవంత్ అనుకూల వర్గం…మాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పీసీసీ నాకే ఇవ్వాలి…అని చెప్పుకునే వరకు బాగానే ఉంటుంది. ఐతే ఇతరుల వ్యవహారంపై బేస్ లెస్ కామెంట్స్‌తో కొంత ఇబ్బంది పడుతుంది ఆయన టీం. పీసీసీ పదవి కావాలి అంటూనే… మరికొన్ని అదనపు కామెంట్స్‌తో కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారు. ఇక జగ్గారెడ్డి కూడా తాజాగా ఇంఛార్జి టాగూర్ మీద కామెంట్స్ చేశారు. ఆయన ఒకరికి అనుకూలంగా వ్యవహారం చేస్తున్నారు మమ్మల్ని పట్టించుకోవడం లేదంటున్నారు. దీనిపై పార్టీలో ఇంకో వర్గం జగ్గారెడ్డి కామెంట్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోరు అంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు.

ఇలా కాంగ్రెస్ నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు…పార్టీలో మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి. ప్రజాస్వామ్యం పేరుతో మరింత పలచన అయిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here