Home News

తెలంగాణ కాంగ్రెస్ కి యువరక్తం కరువైందా ?

తెలంగాణ కాంగ్రెస్ లో తలపండిన సీనియర్ నేతలున్నారు. ఒక్కోక్కరు దశబ్దాలుగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. పార్టీ అధికారంలోకి వస్తే పదవులకోసం అగ్రభాగాన నిలిచేది వీరే. ఇప్పటికే సీనియర్ నేతలు చాలా మంది రాజకీయంగా రిటైర్ మెంట్ స్టేజీకి వచ్చేశారు. అయినా ఎన్నికలొస్తే పోటీకి వీరే ముందు సై అంటున్నారు. వరుస పరాజాయాలతో కనీస సానుభూతిని కూడా పొందలేకపోతున్నారు. ఆర్ధికంగా,రాజకీయంగా బలంగా ఉన్న అధికార టీఆర్‌ఎస్ ను ఏదుర్కోవడం వీరి వల్ల సాధ్యమేనా అన్న చర్చ ఇప్పుడు టీ కాంగ్రెస్ శ్రేణుల్లో కరువైంది.

ఎన్నికలొస్తే టిక్కెట్లను దక్కించుకోవడం మీద దృష్టి పెట్టే ఈ సీనియర్లు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకునే వారు ఎంతమంది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. పేరు గొప్ప నేతలున్నా ఫలితం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన నేతలు తప్ప మరెవ్వరూ రాజకీయంగా యాక్టివ్ గా లేరు. వగీతారెడ్డి, దామోదర రాజనరసింహ, జానారెడ్డి, షబ్బీర్ ఆలి, వి.హనుమంతరావు, మధు యాష్కి, పొన్నం ప్రభాకర్ ఇలా పేరుకే చాలా మంది సీనియర్లున్నా వీరంతా పార్టీ వేవ్ ఉన్నప్పుడే విజయం సాధిస్తారు.

ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కావల్సింది యువరక్తం. కాంగ్రెస్ ను ముందుండి నడిపించే యువ నాయకత్వం కావాలి. అసాధరణ పరిస్థుతులో మాత్రమే ఓటమి చెందిన జానారెడ్డిని ఇదే తన చివరి ఎన్నిక అని ప్రజలకు వివరించినా సాగర్ ఉప ఎన్నికలో నిర్ధాక్ష్యణ్యంగా తిరస్కరించారు. ఇక జానారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తానని జానారెడ్డి చెప్పారు.

ఇక మిగిలిన సీనియర్లు కూడా జానారెడ్డ్డిని అనుసరించిన యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తే కాంగ్రెస్ కి వచ్చే ఎన్నికల్లో అయినా అధికారం లభిస్తుంది. ఇక ఈ సారి కూడా సాధ్యం కాకపోతే ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితే తెలంగాణలో కూడా రిపీటవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here