Home Entertainment Cinema

ఆ పాటను రీమిక్స్ చేసుకుంటున్న బాలయ్య..

బాలయ్య సినిమాలో రీమిక్స్ పాటలు బాగానే వస్తుంటాయి. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు రీమిక్స్ పాటలున్నాయి. ముఖ్యంగా తండ్రి పాటలనే ఎక్కువగా రీమిక్స్ చేస్తుంటాడు బాలయ్య. అల్లరి పిడుగు సినిమాలో భలే తమ్ముడు సినిమాలోని నేడే ఈనాడే సాంగ్ రీమిక్స్ చేసాడు బాలయ్య. ఆ తర్వాత ఒక్క మగాడు సినిమా కోసం పట్టుకో పట్టుకో పట్టుచీర సాంగ్ రీమిక్స్ చేసారు.. ఆ వెంటనే పూరీ జగన్నాథ్ పైసా వసూల్ సినిమాలో కొంటె నవ్వు పాటను రీమిక్స్ చేసారు. అయితే ఎన్టీఆర్ పాటను రీమిక్స్ చేసిన ప్రతీసారి బాలయ్యకు డిజాస్టర్స్ వచ్చాయి. దాంతో ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాడు నందమూరి వారసుడు. ఇప్పుడు తన పాటను తానే రీమిక్స్ చేసుకుంటున్నాడు.

త్వరలోనే బోయపాటి సినిమాతో బిజీ కానున్నాడు బాలయ్య. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ పాటను రీమిక్స్ చేయబోతున్నారు. బంగారు బుల్లోడు సినిమాలో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిన స్వాతిలో ముత్యమంత పాటను రీమిక్స్ చేస్తున్నారని తెలుస్తుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అప్పట్లో ఈ పాట సంచలనం సృష్టిచింది. ఇప్పటికీ ఆ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి పాటను ఇప్పుడు రీమిక్స్ చేస్తున్నారు. తమన్ ఈ పాటను తనదైన శైలిలో రీమిక్స్ చేయబోతున్నాడు.

ఇప్పటికే తమన్ కొన్ని పాటలను రీమిక్స్ చేసాడు. ఇప్పుడు మరోసారి ఇలాంటి పనే చేయబోతున్నాడు. సినిమాలో బాలయ్య, అంజలిపై ఈ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. మొత్తానికి సొంత పాటైనా ఈ సారి బాలయ్యకు కలిసొస్తుందో లేదో చూడాలిక. అసలే మూడు వరస డిజాస్టర్స్ తో బాలయ్య బాగా వెనకబడిపోయాడు. రూలర్ కంటే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కూడా దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో బోయపాటి సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు బాలయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here