Home News Updates

పాద పూజ చేస్తుంటే లేపుకెళ్లాడు

కాషాయం ధరించాడు .. కమండలం చేతబట్టాడు .. పూజలు చేస్తానన్నాడు .. ఇక అంతే జనం నమ్మారు.. ఇంకేముంది … జనానికే నామం పెట్టాడు… ఎవరాయన .. ఏంటి ఆ కథ.. మీరీ చూడండి ..

ఉత్తర కర్ణాటకలోని విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ కు చెందిన దత్తాత్రేయ అవధూత 2 నెలల కిందటే హొళలి గ్రామానికి వచ్చాడు. కాషాయం ధరించి కమండలం చేతపట్టి తన వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకున్నాడు. గ్రామంలో వున్న భీమలింగేశ్వర ఆలయంలో పూజారిగా పని చేస్తానని గ్రామస్థులకు చెప్పి ఒప్పించాడు. తాను భగవంతుడి స్వరూపం అని చెబుతూ త్వరలోనే అక్కడ ఓ ఆశ్రమాన్ని స్థాపించి గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని బాగా నమ్మబలికాడు ..ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా అతను గ్రామంలో జాతరను భారీస్థాయిలో నిర్వహించాడు. దీంతో ప్రజలు తమ గ్రామానికి మంచి స్వామీజీ వచ్చాడని సంబరపడుతున్న సమయంలోనే అందరికీ దిమ్మ తిరిగింది ..

హోళలి గ్రామానికే చెందిన యువతి ఆశివరాత్రి రోజు స్వామీజీకి పాదపూజ చేసి వస్తానని వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. ఇక ఆందోళన పడిన కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా కనిపించలేదు. అదే సమయంలో స్వామీజీ కూడా కనిపించడం లేదని తెలియడంతో అంతా షాకయ్యారు. స్వామీజీ ఆ యువతిని తీసుకుని వెళ్తుండగా తాము చూశాడని కొందరు స్థానికులు చెప్పడంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు కూడా షాకయ్యారు. ఆ యువతి రోజూ మఠానికి వచ్చేదని ఈ క్రమంలోనే స్వామీజీ ఆమెను లోబరుచుకుని వెంట తీసుకెళ్లాడని తెలుసుకున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులు స్వామీజీపై కోలారు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి సోదరుడు కూడా అదే మఠంలో కొన్నాళ్లుగా స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం అతడికి స్వామీజీ ఫోన్ చేసి ఆమెను తిరుపతిలో పెళ్లి చేసుకున్నానని రెండు మూడు రోజుల్లో తిరిగొస్తామని చెప్పాడు. ఈ ఘటన పై కోలార్ జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. స్వామీజీ ఆచూకీ తెలుసుకునేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here