Home Entertainment Cinema

సుశాంత్‌ సింగ్‌ డెత్‌ ఎందుకు మిస్టరీగా మారింది ?

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయి సరిగ్గా ఏడాదయ్యింది. అయినా ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది. కేసు దర్యాప్తులో..సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలో కంటే ఎక్కువ ట్విస్టులున్నాయి. ఇప్పటికీ కేసు పూర్తి కాలేదు. సుశాంత్‌ది హత్యా..లేక ఆత్మహత్యా అనేది ఇంకా తేలలేదు. రెండు కాక..అభిమానులు ఆరోపిస్తున్నట్లు బాలీవుడ్‌ మాఫియా ప్రొద్భలం వల్ల జరిగిన హత్య అనే విషయం
కూడా ఎటూ తేలకుండా పోయింది. అనుమానాలు, ఆరోపణలు, విచారణ, వివాదాలు.. వీటి నడుమే సుశాంత్‌ మరణం కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది.

సుశాంత్‌ సింగ్‌ డెత్‌ మిస్టరీని ఛేదించడానికి మూడు దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఇందులో సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలు ఉన్నాయి. అయితే ఏ ఒక్క దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు డెత్ మిస్టరీని చేధించలేకపోయాయి. తొలుత ఆత్మహత్య కేసుగా నమోదు చేసిన ముంబై పోలీసులు, 2020 జూన్ 28వ తేదీన సుశాంత్ సింగ్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యుల పేర్లను పేర్కొన్నారు. అంతేకాదు రూ.15 కోట్లు సుశాంత్ సింగ్ ఖాతా నుంచి వివిధ ఖాతాలకు బదిలీ అయ్యాయని చెప్పారు. 2020 జూలై 31వ తేదీన ఈడీ కేసు నమోదు చేసి మనీ లాండరింగ్ పై దర్యాప్తు ప్రారంభించింది.

అదే సమయంలో బీహార్ పోలీసులు సుశాంత్ మృతికి గల కారణాలపై విచారణ చేసేందుకు ముంబైకి చేరుకోగా ముంబై పోలీసుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లభించలేదు. ముంబై పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో బీహార్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా విచారణ చేయడంపై ముంబై పోలీసులు అభ్యంతరం తెలుపుతూ బీహార్ పోలీసులకు సహకరించలేదు. ఇక ఇది కాస్త రాజకీయరంగు పులుముకుంది. వెంటనే బీహార్ ప్రభుత్వం సుశాంత్ సింగ్ మృతి కేసును సీబీఐకి అప్పగించింది. 2020 ఆగష్టు 6వ తేదీన సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో రియాచక్రవర్తి ఇతరుల పేర్లను చేర్చింది.

ఇక సీబీఐ ముంబైకు చేరుకుని సుశాంత్ సింగ్ ఇంటిలో సీన్ రిక్రియేట్ చేశారు. అంతేకాదు ఫోరెన్సిక్ రిపోర్టు ఇవ్వాలని ఎయిమ్స్‌ను కోరింది సీబీఐ. ఇక తమ దర్యాప్తులో భాగంగా మొబైల్‌ ఫోన్లను చెక్ చేసినప్పుడు అందులో డ్రగ్స్‌కు సంబంధించిన మరో కొత్త కోణం వెలుగులోకి తీసుకొచ్చింది ఈడీ.మరోవైపు ఆర్థిక లావాదేవీల కోణంలో ఈడీ, డ్రగ్స్‌ లింకులతో.. ఎన్‌సీబీ.. సుశాంత్‌ కుటుంబ సభ్యుల నుంచి బాలీవుడ్‌ సెలబ్రిటీల దాకా వీలైనంత ఎక్కువ మందిని ప్రశ్నించాయి.. అనుమాని తుల్ని అరెస్ట్‌ చేశాయి. ఏదైతేనేం ఏడాది పూర్తయ్యింది. సీబీఐ నుంచి, ఇతర విభాగాల నుంచి సుశాంత్‌ కేసులో ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అందుకు సోషల్‌ మీడియా మాత్రం జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అని నినాదం చేస్తోంది.

సుశాంత్‌ మృతి కేసు కొంతకాలం పక్కదారి పట్టి.. అందులో నుంచి పుట్టిన డ్రగ్స్‌ కేసు పీక్స్‌కు వెళ్లింది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు, టాలీవుడ్‌, శాండల్‌వుడ్‌ హీరోయిన్లను కూడా ఎన్‌సీబీ విచారణ జరిపింది. చాలాకాలం డ్రగ్స్‌ కేసే నడిచింది. ఆ తర్వాత అది కూడా మెల్లగా నీరు కారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here