Home News

ఎంపీ రఘురామరాజుకి బెయిల్ మంజూరు..కండీషన్స్ అప్లై

నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అది కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రఘురామరాజు ఆరోగ్యం దృశ్య బెయిల్ పట్ల సానుకూలంగా స్పందించిం సుప్రీంకోర్టు. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సూచించింది.

బెయిల్ మంజూరు చేస్తూనే పలు కండీషన్లు పెట్టింది..దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలి అని తెలిపింది. ఇక కేసుకు సంభందించి కానీ మరే ఇతర విషయాలు కానీ మీడియా ఇతర సోషల్ మీడియా చానళ్లలో కూడా మాట్లడవద్దని సూచించింది. గతంలో చూపించినట్లు తన గాయాలను ఎక్కడా చూపించవద్దని ఇక నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం అని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here