Home Entertainment Cinema

అబ్బాయిలైనా పడుకోవాల్సిందే అంటున్న సన్నీ లియోన్..

సాధారణంగా ఇండస్ట్రీలో ఆడవాళ్లకు భద్రత లేదు అంటారు. అవకాశం కోసం నిర్మాతల కోరికలు తీర్చాలి.. వాళ్ళు చెప్పింది చేయాలి అంటూ బయట చాలా మాట్లాడుకుంటారు. కొందరు హీరోయిన్లు కూడా బయటికి వచ్చి ఇదే చెప్పారు. అవకాశం రావాలంటే కచ్చితంగా పడకగదికి వెళ్లాల్సిందే అంటూ కొందరు బాహాటంగానే చెప్పారు. కంగనా రనౌత్ అయితే కెరీర్ మొదట్లో అవకాశాల కోసం పడుకున్నాను అని ఒప్పుకుంది కూడా. ఇదంతా ఒక సైడ్ ఉంటే ఇప్పుడు సన్నీలియోన్ మరో కోణం గురించి బయట పెట్టింది.

ఇండస్ట్రీలో ఆడవాళ్ళకు మాత్రమే కాదు మగ వాళ్లకు కూడా భద్రత లేదు అంటూ సంచలన కామెంట్స్ చేసింది సన్నీ లియోన్. అవకాశాల కోసం కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా ఒళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారు అంటూ కొత్త కోణం గురించి చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కాకపోతే అంత అమ్మాయిలపై ఫోకస్ చేస్తారు కాబట్టి అబ్బాయిలపై జరిగే అఘాయిత్యాలు బయటికి రావు అంటుంది.. పైగా ఎవరూ బయటికి వచ్చి చెప్పుకోరు కదా అంటూ నిప్పులాంటి నిజాలను చెప్పుకొచ్చింది సన్నీలియోన్.

ఈ భామ ఎవరి విషయంలో ఇలాంటి నిజాలను చూసిందో తెలియదు కానీ అబ్బాయిలకు కూడా భద్రత లేని ఇండస్ట్రీలో చూస్తుంటే నిజంగానే అంత భయపడుతున్నారు. ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ అనేది పీక్స్ కు చేరిపోయింది. చాలా మంది హీరోయిన్లు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకున్నారు. అయితే అబ్బాయిల విషయంలో మాత్రం ఇలాంటివి ఉన్నాయా అనేది అనుమానమే. అయితే ఆ మధ్య ఓ యువ నటుడు కూడా ఇండస్ట్రీలో అబ్బాయిలను బుక్ చేసుకునే అమ్మాయిలు ఉన్నారంటూ సంచలనం రేపాడు. ఇప్పుడు సన్నీ లియోన్ కూడా ఇదే చెప్పింది. ఏదేమైనా కూడా దీని గురించి తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here