Home News Updates

వ్యాక్సిన్‎పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలే..! -కేంద్రం

కరోనా వ్యాక్సిన్‎పై దుష్ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిని గుర్తించాలని తెలుపుతూ రాష్ట్రాల సీఎస్‎లకు ఆదేశాలు జారీచేసింది. దేశంలో జనవరి 16నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం విధితమే.

అయితే కేంద్రం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్‎పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వ్యాక్సిన్‎పై పుకార్లు వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు ఉంటామన్న కేంద్రం..తప్పుడు సందేశాన్ని అందిస్తున్న వారిపై ఓకన్నేసి ఉంచాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

దేశానికి నష్టం కలిగించేలా..ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వార్తలు ప్రచారం చేయకుడదని, అలాంటి వారిని మీమీ ప్రాంతాల్లో తక్షణమే గుర్తించాలని పేర్కోంది కేంద్రం. ఇదే విషయమై రాష్ట్రాలకు , కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్‎లకు కేంద్ర హోంశాఖ సెక్రటరి అజయ్ భల్లా లేఖలు రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here