Home Entertainment Cinema

RRR రిలీజ్ డేట్ వాయిదా.. అభిమానులకు భారీ షాక్..

ముందు నుంచి అనుకుంటున్నదే. చాలా రోజుల నుంచి రాజమౌళి సినిమా వాయిదా పడుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దాన్ని నిజం చేశాడు దర్శక ధీరుడు. తన కెరీర్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెప్పిన సమయానికి ఏ సినిమాను విడుదల చేయలేదు రాజమౌళి. ఈగ సినిమా నుంచి దీన్ని మరి సెంటిమెంట్ లా ఫీల్ అవుతున్నాడు. రిలీజ్ ఒకటి చెప్పడం దాన్ని మళ్ళీ మార్చడం రాజమౌళికి అలవాటుగా మారిపోయింది. త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇలాగే మార్చేశాడు రాజమౌళి. ఈ సినిమా విడుదల తేదీ జూలై 30 అని గతేడాది ప్రెస్ మీట్ పెట్టి మరి అనౌన్స్ చేశాడు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. కానీ ఆయన మాటలను పెద్దగా ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు అనుకున్నట్టుగానే జరిగింది.. తన సినిమాను మరోసారి పోస్ట్ ఫోన్ చేశాడు రాజమౌళి. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా ఆరు నెలల పాటు త్రిబుల్ ఆర్ సినిమా వాయిదా వేశాడు. జూలై 30వ తేదీ నుంచి 2021 జనవరి 8 కి ఈ సినిమాను పోస్ట్ ఫోన్ చేశాడు దర్శక ధీరుడు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో అనౌన్స్ చేశాడు. ఇది చూసిన అభిమానులు షాక్ అయ్యారు. కానీ రాజమౌళి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఇది ముందు నుంచి ఊహించిందే కదా అంటూ వాళ్ళు ఓ నవ్వు నవ్వుకున్నారు. అనుకున్న సమయానికి సినిమా తీసుకు రావడం కంటే క్వాలిటీ ఔట్ పుట్ తీసుకురావడం తనకు ముఖ్యం అంటున్నాడు రాజమౌళి. రాత్రింబవళ్ళు సినిమా షూటింగ్ జరుగుతున్న కూడా అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయలేకపోతున్నాం..

అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే కానీ తప్పదు అంటున్నాడు రాజమౌళి. కానీ సినిమా చూసిన తర్వాత ఇవన్నీ మీరు మర్చిపోతారు అని మాట ఇస్తున్నాడు. ఏదేమైనా కూడా సంక్రాంతి సీజన్లో రాజమౌళి వస్తున్నాడు.. ఆయన వస్తున్నాడు అని తెలిసిన తర్వాత రావడానికి ఇంక ఏ హీరో కూడా ధైర్యం చేయడు. దాంతో 2021 సంక్రాంతి సోలో విడుదల ఉండబోతుందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here