Home News Politics

సిక్కోలులో ఈ మాజీ కేంద్రమంత్రి పయనమెటు…?

వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు … రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో ఓటమి పాలైన ఆ కాంగ్రెస్‌ నేత ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు .. ఈ సారి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న ఆ మాజీ ఎంపీకి పార్టీపరంగా సానుకూల సంకేతాలు రాలేదంట.. దాంతో వైసీపీ పెద్దలు సామాజికవర్గ సమీకరణాలతో సదరు నేతను తమ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారంట .. అటు కాంగ్రెస్‌ నేతలు పార్టీ మారే విషయమై తొందరపడొద్దని వారిస్తున్నారంట… ఇంతకీ అంత డిమాండ్‌ ఉన్న ఆ నేత ఎవరంటారా?

కిల్లి కృపారాణి … ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్‌ నాయకురాలు … రాజకీయ అరంగేట్రంలోనే సిక్కోలులో దిగజ నేతగా పేరున్న ఎర్రన్నాయుడి పై పోటీకి దిగిన నేత… 2004 ఎన్నికల్లో తొలిసారిగా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన డాక్టర్‌ కిల్లి కృపారాణి ఆ ఎన్నికల్లో కింజరాపు ఎర్రంనాయుడు చేతిలో ఓడిపోయారు … అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు … 2009 ఎన్నికల్లో ఆమె మళ్లీ శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీచేసి ఘన విజయం సాధించారు … గెలిచిన మూడేళ్ల తర్వాత ఆమెను కేంద్రమంత్రి పదవి వరించింది .. కేంద్ర ఐటిశాఖ మంత్రిగా ఆమె దాదాపు రెండు సంవత్సరాలు పనిచేశారు … ఐతే రాష్ట్ర విభజన ప్రభావంతో 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన ఆమె.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు .

కాళింగ సామాజికవర్గానికి చెందిన కృపారాణికి … శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు గణనీయంగా ఉండటం ప్లస్‌ పాయింట్‌ అయింది.. అదలా ఉంటే ఎలాగైనా సరే ఒకసారి స్టేట్ పాలిటిక్స్ లో ఎంటరవ్వాలన్న పట్టుదలలో ఉన్న ఆమె … ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే ఏ పార్టీ తరపున అయినా బరిలోకి దిగుతానని సంకేతాలిస్తున్నారట .. ఎర్రంనాయుడుని ఓడించి జాతీయ రాజకీయాల్లోకి ఎంటరైన ఆమె… మంత్రి అచ్చెన్న పై గెలిచి స్టేట్‌ పాలిటిక్స్ లో అడుగుపెట్టాలనుకుంటున్నారట …

కృపారాణిని తమ పార్టీ తరపున టెక్కలి బరిలో దించాలన్న ఆలోచనతో… వైసీపీ పెద్దలు పీకే టీంతో ఓ సర్వే కూడా చేయించేశారట … తర్వాత ఇంటికెళ్లి మరీ కృపారాణి ముందు ఆ ప్రతిపాదన పెట్టారట… దాంతో ఆమె వైసీపీ తరపున టెక్కలి బరిలో దిగడం ఖాయమన్న ప్రచారం జరిగింది… అయితే వైసీపీలోని కొందరు నేతల కారణంగా ఆ ప్రతిపాదన అటకెక్కిందంట .. ఆ క్రమంలో తాజాగా మరోసారి సిక్కోలులో కృపారాణి హాట్ టాపిక్ గా మారారు … ఆమెను ఎంపీ బరిలో దించడానికి వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ఆమె మళ్లీ వార్తల్లో వ్యక్తయ్యారు…

ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా దువ్వాడ శ్రీను కొనసాగుతున్నారు … అయితే దువ్వాడకు ఎంపీ టిక్కెట్ పై పెద్దగా ఆసక్తి లేనట్లు తెలుస్తోంది.. ఏడు నియోజకవర్గాలను సమన్వయపరుస్తూ…ఎన్నికల ఖర్చును భరించడం తన వల్ల కాదని ఇప్పటికే దువ్వాడ చేతులెత్తేసినట్లు టాక్ … దాంతో వైసీపీ పెద్దలు పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావును ఎంపీగా బరిలోకి దించాలని భావించారట … అందుకు ధర్మాన సుముఖత వ్యక్తం చేయలేదంట ….

కాళింగ సామాజికవర్గం ఓట్లను దక్కించుకోవడానికి ఇప్పుడు కృపారాణి అభ్యర్ధిత్వాన్ని పరిశీలిస్తున్నారంట .. కృపారాణి పట్ల ఆ సామాజికవర్గంలో మంచి అభిప్రాయం ఉండటం … కింజరాపు కుటుంబానికి గట్టి పోటీ ఇవ్వగల క్యాండెట్ అన్న అభిప్రాయంతో .. వైసీపీ కీలక నేత ఒకరు ఇటీవల కృపారాణితో మంతనాలు సాగించినట్లు తెలిసింది… వైసీపీలో చేరమని కృపారాణి పెద్ద కుమారుడు విక్రాంత్ కూడా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం … అయితే కృపారాణి భర్త రామ్మోహన్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే బెటర్ అంటున్నారట .

వైసీపీ ఎంపీ క్యాండెట్‌గా కృపారాణి ఓకే అయితే .. ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్న దువ్వాడను టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడిపై పోటీకి దించే ఆలోచనలో ఉన్నారంట .. అలాగే ప్రస్తుతం టెక్కలి సమన్వయకర్తగా ఉన్న పేరాడకు నామినేటెడ్ పదవి ఇస్తారన్న టాక్ నడుస్తోంది … అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న కృపారాణి పార్టీ మారే విషయంలో ఈ సారి ఆచితూచి అగుడులేయాలని భావిస్తున్నారట . గతంలో తనను వైసీపీ నేతలు సంప్రదించారని తెలియగానే జిల్లాలో పలువురు ముఖ్యనేతలు ఆ పార్టీ పెద్దల వద్ద పుల్లలు వేయడం… టెక్కలి సమన్వయకర్తగా పేరాడ తిలక్ ను తెరపైకి తేవడం వంటి విషయాలను ఆమె రివైండ్ చేసుకుంటున్నారట … అందుకే కచ్చితమైన హామీ వచ్చిన తర్వాతే తనతో టచ్ లో ఉన్న నేతలకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నారట …

ఇక ఇదే సమయంలో కృపారాణి వైసిపితో టచ్‌లో ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం …ప్లీజ్ వెయిట్ అంటుందట … వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే బరిలోకి దిగే ఆలోచనలో ఉండటంతో .. పార్టీని నమ్ముకున్న వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని అభయం ఇస్తున్నారట … మరి చూడాలి ఆ మాజీ కేంద్రమంత్రి ఏ డెసిషన్‌ తీసుకుంటారో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here