Home Entertainment Cinema

శ్రీదేవి రెండో వర్ధంతి.. ఒక్కసారి ఆమెను గుర్తు చేసుకుందాం..

శ్రీదేవి చనిపోయి అప్పుడే రెండేళ్లు అయిపోయిందా.. నమ్మడానికి కూడా చాలా కష్టంగా ఉంది కదా. అయినా కూడా ఇదే నిజం.. సరిగ్గా 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో కన్ను మూసింది. ఒక పెళ్ళికి వెళ్ళిన శ్రీదేవి అక్కడ చనిపోవడం సంచలనం సృష్టించింది. మొద‌ట్లో ఆమె మ‌ర‌ణం కాస్త అనుమానాస్పదంగా అనిపించినా కూడా చివ‌రికి సహజ మరణం అని తేల్చేశారు పోలీసులు. ఆమె చనిపోయిన తర్వాత నాలుగు రోజులకు కానీ భౌతిక‌కాయం ఇండియాకు రాలేదు. అభిమానుల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు ముంబైలోనే జరిగాయి. అప్పుడే ఈమె మరణించి రెండేళ్లు పూర్తవుతుంది. ఈమె రెండో వర్ధంతి ముంబైలోని చేస్తున్నారు కుటుంబ సభ్యులు. గత ఏడాది శ్రీదేవి తొలి వర్ధంతి ఆమె సొంత రాష్ట్రం అయిన తమిళనాడులోనే జరిగింది. చెన్నైలో ఆమెకు ఒక సొంత ఇంటి తో పాటు కొన్ని పొలాలు కూడా ఉన్నాయి.

ఆమె బతికి ఉన్నప్పుడు ఎప్పుడు సరదాగా సమయం గడపాలి అని కూడా చెన్నైకి వచ్చేది. దాంతో ఆమెకు ఇష్టమైన ప్రదేశంలోనే తొలి వర్ధంతి జరిపారు కుటుంబ సభ్యులు. ఇప్పుడు రెండో వర్ధంతి మాత్రం అక్కడే చేస్తున్నారు. ఇప్పటికే కపూర్ కుటుంబ సభ్యులు మొత్తం ముంబై లో శ్రీదేవి ఇంట్లో ఉన్నారు. ఆమె రెండో వర్ధంతి అక్కడే అభిమానుల మధ్య జరుపుతున్నారు. దాని కోసం ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. శ్రీదేవి వర్ధంతి సందర్భంగా తమిళ, హిందీ ఇండస్ట్రీ నుంచి కొందరు సినిమా వాళ్లు కూడా రానున్నారు. వాళ్లతో పాటు టాలీవుడ్ నుంచి కూడా కొందరు వెళ్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి శ్రీదేవి చనిపోయే అప్పుడే రెండేళ్లవుతుంది అంటే నమ్మడం మాత్రం అంత ఈజీ కాదు. కానీ కాలం చాలా వేగంగా వెళ్ళిపోయింది.. ఆమెతో పాటు శ్రీదేవి ని కూడా తీసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమె గుర్తులు మాత్రమే మన దగ్గర మిగిలాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here