కరోనా సమయంలో ఆపద్భాందవుడిగా అనేక మందికి సాయం చేస్తున్న రియల్ హీరో సోనూసూద్ ఇప్పుడు ఏకంగా ఏపీ ప్రభుత్వానికి కూడా సాయం అందిస్తున్నారు. దేశంలో ఆక్సీజన్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇక ఏపీలో నెల్లూరుజిల్లాలో కూడా ఆక్సిజన్ అందక పలువురు కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. సోనూసూద్ కి నెల్లూరులో కొందరు మిత్రులుండటం వారు ఆయనకు ఈ విషయం తెలపడంతో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. తక్షణ అవసరం ఏంటో చెప్పండని మిత్రులను కోరడంతో వారు నెల్లూరు కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

సోనూసూద్‌తో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్ ఆక్సీజన్ ప్లాంట్ అవసరమని సోనూ దృష్టికి తీసుకెళ్లారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు కి అవసరమైన సామాగ్రి పంపుతా అన్న సోనూసూ్ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ కి సూచించారు. రూ.1.5 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సోనూ అంగీకరించారు. వచ్చే రెండు రోజుల్లోనే ఈ సామాగ్రి నెల్లూరుకి చేరుకోనున్నట్లు తెలుస్తుంది. రియల్ హీరో సాయంతో నెల్లూరులో కరోనా రోగులకు మరింత ఆసరా లభించింది.