Home Health corona

సింగర్ మధు ప్రియకు వేధింపులు..కేసు నమోదు..!

సింగర్ మధుప్రియను గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లో వేధిస్తున్నారు. బ్లాంక్ కాల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సింగర్ మధుప్రియ ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా రాత్రి, పగలు తేడా లేకుండా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని మధు ప్రియ ఆరోపిస్తోంది.

గత కొన్ని రోజులుగా వేధింపులతో తాను మానసికంగా సతమతమవుతున్నానని… నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ షీ టీమ్స్ కు మెయిల్ లో ఫిర్యాదు చేసిది సింగర్ మధు ప్రియ. ఐపీసీ 509, 354b సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here