Home Health corona

లాక్‌ డౌన్: పోలీసులకు షాక్‌ ఇచ్చిన సిద్దిపేట అడిషనల్ ఎస్పీ..మారువేషంలో…

తెలంగాణలో కరోనా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తే తాట తీస్తున్న పోలీసులకు అడిషనల్ ఎస్పీ షాకిచ్చారు. గ్రౌండ్ లెవల్లో పోలీసుల పనితీరు ఎలా ఉంది. లాక్ డౌన్ ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకునేందుకు సిద్దిపేట అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ మారు వేషంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. లాక్ డౌన్ ఎలా అమలవుతుందనే విషయం పై డీజీపీ మొదలు పోలీసు ఉన్నతాధికారులంతా ఫోకస్ పెట్టారు. ఆదే క్రమంలో సిద్ధిపేట ఆడిషనల్ ఎస్పీ ఏకంగా మారు వేషంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించి పోలీస్‌ సిబ్బందిని షాక్‌కి గురిచేశారు.

సిద్దిపేట పరిధిలో లాక్ డౌన్ అమలు తీరు ఎలా ఉంది పోలీసుల ఎలా ప్రవర్తిస్తునారన్న దాని పై గ్రౌండ్ రియాల్టీ తెలుసుకున్నారు. తలకు రుమాలు ధరించి, పాత మోటారు బైక్‌పై ఎక్కి ఒక్కో చెక్‌పోస్ట్‌ దగ్గర ఒక్కో రకంగా పోలీసులకు సమాధానాలిచ్చి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక చోట మందులు కావాలని.. మరో చోట మంత్రి పీఏ ఫోన్ చేస్తా అని.. ఇంకోచోట పాలు కోసం వెళ్తున్నా అని సమాధానమిచ్చారు. కానీ పోలీసులు అవేవీ పట్టించుకోలేదు. ముందుకు వెళ్లనీయకుండా ఆపేశారు. లాక్ డౌన్ కఠినంగా అమలవుతుందా లేక పోలీసులు నామ్ కే వాస్తి పని చేస్తున్నారా అని పరిశీలించారు.

ఇక చెక్ పోస్టుల తనిఖీ అనంతరం లాక్‌డౌన్ అమలు పై సంతృప్తి వ్యక్తం చేశారు ఏఎస్పీ. తిరుగు పయనంలో తలకు ఉన్న రుమాలు లేకుండా వచ్చి చెక్ పోస్టులో ఆపిన పోలీసులకు షాకిచ్చాడు. తెలంగాణలో పోలీసులు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు..ఓ వైపు భద్రత అంటూ సున్నితంగా మెసేజ్‌ ఇస్తూనే గీత దాటే వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here