Home News

    షాకింగ్: చైనా నుంచి ప్రపంచానికి మరో ముప్పు..భూమిపై కూలనున్న చైనా రాకెట్

    ఇప్పటికే కరోనా వైరస్‌ను ప్రపంచానికి అందించిన చైనా.. ఇప్పుడు మరో ముప్పును భూమి నెత్తిన పెట్టింది. ఇటీవలే చైనా ప్రయోగించిన ఓ రాకెట్‌ భూమిపై కూలే దిశగా ప్రయాణిస్తోంది. ఏ క్షణమైన అది భూమ్మీద పడవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ రాకెట్‌ కూలిపోయిన సముద్రంలో పడుతుంది. కానీ చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ మాత్ర భూమి దిశగా దూసుకువస్తుందట. అది ఎక్కడ పడనుందో తెలియక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    చైనా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రయోగాలను మొదలుపెట్టింది. ఏప్రిల్‌ 29న ఆ దేశానికి చెందిన లాంగ్‌మార్చ్‌5బీ రాకెట్‌ తియాన్హే స్పేస్‌ స్టేషన్‌ కోర్‌ మాడ్యూల్‌ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. ఇప్పుడు ఆ లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ శకలాలు పొరబాటున ఓ తాత్కాలిక కక్ష్యలోకి చేరాయి. అవి భూమిపై పడనున్నాయి. కచ్చితంగా ఎక్కడ కూలతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పటికే 80 కిలోమీటర్లు కిందకు పడిపోయినట్లు స్పేస్‌ న్యూస్‌ సంస్థ రిపోర్ట్‌ చేసింది. ఇది నేలపై పడే అవకాశాలు 71శాతం ఉన్నట్లు సమాచారం.

    అమెరికా రక్షణశాఖ ప్రస్తుతం 5బీ రాకెట్‌ను ట్రాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నెల 8న అది భూమ్మీదకు వచ్చే అవకాశం ఉందంటున్నారు పెంటగాన్‌ శాస్త్రవేత్తలు. కాకపోతే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూవాతవరణంలో ప్రవేశిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. ఈ రాకెట్‌ మార్గాన్ని అమెరికా స్పేస్‌ కమాండ్‌ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. ఇక లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్‌ బరువు సుమారు 21 టన్నులు. అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మించడం కోసం చైనా లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ తియాన్హే స్పేస్‌ మ్యాడుల్‌ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. నియంత్రణ కోల్పోయిన ఈ రాకెట్‌ శకలాలు భూమి మీదకు దూసుకురానున్నాయి. ఇక తాజాగా ప్రయోగించిన లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ శకలాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. వీటిల్లో న్యూయార్క్‌, మాడ్రిడ్‌, బీజింగ్‌, చిలీ, న్యూజిలాండ్‌ తదితర ప్రాంతాలు ఉన్నట్లు ‘ది గార్డియన్‌’ కథనంలో పేర్కొంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here