టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి ఏర్పాటు చేశాక కేటీఆర్ కి పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ గట్టి ప్రయత్నం చేశారన్నారు బీజేపీ నేత స్వామిగౌడ్. కేటీఆర్ సీఎం అన్న దానిపై కావాలని బయటకు ఫీలర్లు వదిలారని రిజల్ట్ మాత్రం నెగెటివ్ గా వచ్చిందని అందుకే కేసీఆర్ వెనక్కి తగ్గారన్నారు. తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేసి మరి నేతలకు క్లాస్ పీకినట్లు కలరింగ్ ఇచ్చారన్నారు.
కేటీఆర్ ని సీఎం చేయలన్న కల నెరవేరకపోవడంతో కేసీఆర్ మరో కొత్త ప్లాన్ సిద్దం చేశారన్నారు. తెలంగాణకి తొలి మహిళా సీఎం అంటు కవితని రంగంలోకి దింపుతున్నారన్నారు స్వామిగౌడ్. ఇప్పటికే ఈ ప్రచారం ప్రగతి భవన్ కోటలు దాటి బయటకు వచ్చిందన్నారు.