Home Entertainment Cinema

సాహసం చేయబోతున్న శర్వానంద్.. ఈ టైంలో అవసరమా..

ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన శర్వానంద్ ఈ మధ్యలో కాస్త వెనక్కి పడ్డాడు. గత వారం విడుదలైన జాను సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా నెమ్మదిగానే వస్తున్నాయి. దాంతో శర్వానంద్ కోరుకున్న బ్లాక్ బస్టర్ జాను కూడా ఇవ్వనట్లే. ప్రస్తుతం ఈయన కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డితో శ్రీకారం సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 24 నుంచి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రైతు పాత్రలో కనిపిస్తున్నాడు శర్వానంద్. కచ్చితంగా శ్రీకారం సినిమాతో విజయం అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు

Sharwanand

ఈయన. రెండేళ్ల కింద వరకు వరుస విజయాలతో తన మార్కెట్ అమాంతం పెంచుకున్న శర్వానంద్.. పడి పడి లేచే మనసు దగ్గర్నుంచి ఫ్లాపుల బాట పట్టాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన రణరంగం కూడా అంచనాలు అందుకోలేదు. ఇక ఇప్పుడు విడుదలైన జాను కూడా పర్లేదు అనిపిస్తుంది. ఇలాంటి టైమ్ లో ఆశలన్నీ శ్రీకారం సినిమాపైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి ద్విభాషా చిత్రం వైపు అడుగులు వేస్తున్నాడు శర్వానంద్.

ఈ హీరోకి తమిళనాట కూడా గుర్తింపు ఉంది. కెరీర్ మొదట్లో అక్కడ కూడా సినిమాలు చేశాడు శర్వానంద్. అయితే తెలుగు హీరోలకు ద్విభాషా చిత్రాలు అస్సలు కలిసి రాలేదు. గతంలో ఒకసారి నాని, అల్లరి నరేష్, మహేష్ బాబు, నాగార్జున లాంటి హీరోలు ప్రయత్నించినా ఫలితం చాలా దారుణంగా వచ్చింది. ఇప్పుడు మరోసారి శర్వానంద్ ఇలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడు. కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో ద్విభాషా చిత్రం చేస్తే చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అర్థం కాక శర్వానంద్ అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. మరి ఎంచుకోబోయే కథ ఎలా ఉంటుందో చూడాలి.