Home Entertainment Cinema

రాజమౌళికి శంకర్ ఎదురెళ్తున్నాడా.. RRRకి పోటీగా భారతీయుడు 2..

ఇద్ద‌రూ ద‌క్షిణాది ద‌ర్శ‌కులే. కానీ ఇప్పుడు ఇద్ద‌రూ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్స్ గా ఎదిగారు. ద‌క్షిణాది సినిమా రంగం నుంచి వ‌చ్చి.. ఇక్క‌డి సినిమాలను ఇండియ‌న్ సినిమా స్థాయి పెంచే విధంగా తెర‌కెక్కించారు. మ‌గ‌ధీర‌, ఈగ‌, బాహుబ‌లి లాంటి సినిమాల‌తో రాజ‌మౌళి స‌త్తా ఇండియ‌న్ సినిమాకు తెలిసింది. ఇక ఈయ‌న కంటే ముందే శంక‌ర్ మ‌న ద‌క్షిణాది సినిమా రంగాన్ని బాలీవుడ్ ముందు పెట్టాడు. అక్క‌డోళ్లు శంక‌ర్ స‌త్తా చూసి నోరెళ్ల‌బెట్టుకున్నారు. రోబో, ఐ, 2.0 సినిమాల‌తో త‌న రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు శంక‌ర్. 

ప్ర‌స్తుతం ఈ దర్శకులు రెగ్యులర్ సినిమాలు చేయడం మానేశారు. విజువల్ ఎఫెక్ట్స్ అత్యద్భుతంగా ఉండే హాలీవుడ్ రేంజ్ సినిమాలను మాత్రమే చేస్తున్నారు. వీళ్ళలో రాజమౌళి కాస్త ముందున్నాడు. బాహుబలి సినిమాలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఇక శంకర్ తెరకెక్కించిన 2.0 సినిమా కూడా పర్లేదు అనిపించింది. ఇలాంటి ఇద్దరు అగ్ర దర్శకులు ఇప్పుడు ఒకేసారి తమ సినిమాలను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉంటే.. శంకర్ భారతీయుడు 2 చేస్తున్నాడు ఈ రెండు సినిమాలు జనవరిలో విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఇందులో రాజమౌళి సినిమా జనవరి 8న రానుంది. మరోవైపు శంకర్ కూడా జనవరిలోనే వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

రాజ‌మౌళి, శంక‌ర్.. ఇద్ద‌రూ మొద‌ట్లో మాస్ సినిమాలే చేసారు. శంక‌ర్ దీనికి కాస్త సోష‌ల్ ట‌చ్ ఇచ్చేవాడు.. రాజ‌మౌళి ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఇద్ద‌రి చూపు టెక్నాల‌జీ వైపు వెళ్లింది. విజువ‌ల్ వండ‌ర్స్ వైపే వెళ్తూ.. ఇండియ‌న్ సినిమా స్టాండ‌ర్డ్స్ ను పెంచేసే ప‌నిలో బిజీగా ఉన్నారు రాజ‌మౌళి, శంక‌ర్. వీళ్ళ త‌ర్వాతి సినిమాలు కూడా విజువ‌ల్ ఫీస్ట్ గానే తెర‌కెక్కుతున్నాయి. \

ఇండియన్ సినిమా గర్వపడే ఇద్దరు అగ్ర దర్శకుల సినిమాలు ఒకేసారి వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర చెప్పడానికి మాటలు ఉండవు. చూడాలి మరి ఈ రేస్ ఎలా ఉండబోతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here