Home Entertainment Cinema

పాన్ ఇండియన్ మూవీగా శంకర్, రామ్ చరణ్ సినిమా

శంకర్, రామ్ చరణ్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ న్యూస్ వినిపిస్తోంది. పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్ అనే మాటకి పర్ఫెక్ట్‌ మీనింగ్‌లా ఈ సినిమాని మార్చేస్తున్నాడట శంకర్. ఒక్కో భాష నుంచి ఒక్కో యాక్టర్‌ని తీసుకుని రామ్‌ చరణ్‌ సినిమాని లార్జ్‌ స్కేల్‌లో డిజైన్ చేస్తున్నాడట శంకర్. మరి ఈ మూవీలో ఎన్ని భాషల ఆర్టిస్టులు నటిస్తున్నారు.

శంకర్ ‘ఇండియన్2’ తర్వాత రామ్‌ చరణ్‌తో ఒక సినిమా తియ్యబోతున్నాడు. దిల్‌ రాజు నిర్మాణంలో పాన్‌ ఇండియన్ మూవీగా రాబోతోందీ సినిమా. ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత చరణ్‌ మార్కెట్‌ని మరింత పెంచేలా ఈ మూవీని లార్జ్‌ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నాడు శంకర్. బాలీవుడ్‌ నుంచి హీరోయిన్, కన్నడ, తమిళ ఇండస్ట్రీస్‌ నుంచి సపోర్టింగ్‌ ఆర్టిస్టులని సెలక్ట్‌ చేస్తున్నాడట.

రామ్ చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ని తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లో ఇప్పుడు స్వింగ్‌లో ఉన్న కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకుంటారని సమాచారం. కియార ఇంతకుముందు తెలుగులో కూడా సినిమాలు చేసింది. మహేశ్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చేసింది.

శంకర్, రామ్‌ చరణ్‌ సినిమాలో కన్నడ స్టార్ సుదీప్‌ విలన్‌గా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు సుదీప్ ‘ఈగ’లో కూడా నెగటివ్ రోల్‌ ప్లే చేశాడు. అలాగే ‘సైరా’లో సపోర్టింగ్‌ రోల్‌ కూడా చేశాడు సుదీప్. ఇక వీళ్లతో పాటు సినిమాలో తమిళ ఆర్టిస్టులు కూడా ఉంటారని సమాచారం. సో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఆర్టిస్టులందరినీ కలిపేసి పాన్ ఇండియన్‌ మూవీ అనే మాటకి కొత్త అర్థం ఇస్తున్నాడు శంకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here