కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. తెలంగాణ ఉద్యమం, అందులో పాల్గొన్న అనేకమంది తెలంగాణ రాజకీయ నాయకులను, ఉద్యమ కారులను చాలా సన్నిహితంగా చూసిన వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. కొడాలి నాని చంద్రబాబు పై చేసిన కామెంట్స్,కేసీఆర్ కి మంత్రి పదవి పై పాశం యాదగిరి ఘాటుగా స్పందించారు.
మర్రి చెన్నారెడ్డి మొదలు ఇంద్రారెడ్డి,దేవెందర్ గౌడ్ వరకు పలువురు నేతలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గురువు పాత్ర పోషించిన పాశం యాదగిరి ఆ తర్వాత కాలంలో కేసీఆర్ కి దూరంగా జరిగారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్,పాశం యాదగిరికి మరింత గ్యాప్ పెరిగింది.