Home News Stories

ఆ సీటు కోసం కమలం పార్టీలో పోటా-పోటీ…!

బీజేపీ కి అంతో ఇంతో పట్టున్న నియోజక వర్గం సికింద్రాబాద్… పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లొ ఆ సీటు పై పార్టీలోని ముగ్గురు సీనియర్ లు కన్నేశారు… ఎవరికి వారే ప్రయత్నాలు మొదలు పెట్టారు… ఆ టికెట్ ను దక్కించుకోవడానికి తమదైన రూట్లలో స్కెచ్‌లు గీసుకుంటున్నారన్న చర్చ కమలం పార్టీలో జరుగుతోంది..అసలు వారి వారి ఈక్వేషన్స్‌ ఏంటి ?..బీజేపీ టిక్కెట్ ఎవరికి దక్కుతుందన్న దాని పై అన్ని పార్టీల్లోనూ హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది…

కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడానికి బిజెపి నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది … ఈసారి 400 సీట్లు టార్గెట్ అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు… తెలంగాణ లోను సత్తా చాటుతామని మరి అంటున్నారు.. అయితే బీజేపీ కి అంత సీన్ కనిపించడం లేదు… తెలంగాణలో ఆ పార్టీ ఖచ్చితంగా గెలుచుకునే సీట్లు ఇవీ అని చెప్పే పరిస్థితి లేదు..ఆ పార్టీకి అంతో ఇంతో పట్టున్న నియోజకవర్గం సికింద్రాబాద్… పలుమార్లు ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు….

2014 ఎన్నికల్లోనూ తెలంగాణ నుండి కాషాయపార్టీ గెలుచుకున్న ఏకైక సీటు అదే … మొత్తం పట్టణ ప్రాంతం కావడం …. మోడీ ఛరిష్మా ఈ సారి కూడా పనిచేస్తుందన్న నమ్మకంతో ఆ సీటు పై బీజేపీ పెద్దలు కన్నేశారు… దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు… ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయ ఇప్పటికే నియోజకవర్గం లో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు… టికెట్ తనకే నని అంటున్నారు… అయితే ఆయన కి ఈ సారి అధిష్టానం టికెట్ ఇవ్వదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది… ఆయనకీ ఏజ్ బార్ అయిందని మరొకరిని పార్టీ హై కమాండ్ ఇక్కడి నుండి బరిలోకి దించుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది…

ఈ నేపథ్యంలో నే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ల పేర్లు తెర పైకి వచ్చాయి… ముషీరాబాద్ నుండి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారట … సికింద్రాబాద్ బీసీ ల ప్రాభల్యం ఉన్న సీటు కాబట్టి దాన్ని బీసీలకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం… పార్టీ ఏదైనా సికింద్రాబాద్‌ ఎంపీ గా గెలిచిన వారంతా బీసీలే అన్న వాదనను ఆయన వినిపిస్తున్నట్టు తెలుస్తోంది..

ఇక కిషన్ రెడ్డి అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు .. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయారు… ఆ సానుభూతి తనకు కలిసి వస్తుందని ఆలోచనతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది…తాను చేసిన కార్యక్రమాలు కలిసి వస్తాయని పార్టీ శ్రేణులతో ను సత్సంబంధాలు తనకు ప్లస్ అవుతాయనే అభిప్రాయంతో ఆయన కనిపిస్తున్నారు … అందుకే ఆయన సికింద్రబాద్‌ ఎంపీ సీటు తనదే అన్న ధీమాతో ఉన్నారాయన

అయితే సికింద్రాబాద్ నుండి కాకుండా కిషన్ రెడ్డి ని చేవెళ్ల కు పంపించాలని … అది రెడ్ల ప్రాభల్యం ఉన్న సీటు అని పార్టీ లోని కొందరు నేతలు వాదిస్తున్నారంట.. మొత్తమ్మీద రాష్ట్రంలోని మిగిలిన ఎంపీ స్థానాల్లో పోటీకి కాషాయ నేతలు వెనకాముందు ఆడుతుంటే.. సికింద్రాబాద్‌ కోసం ముగ్గురు కీలక నేతలు పోటీ పడుతుండటం విశేషమే.. మరి పార్టీ బీ ఫార్మ్‌ ఎవరికి దక్కతుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here