Home Videos

వచ్చే రెండు వారాలు కరోనా విలయతాండవం..షాకింగ్ విషయాలు బయటపెట్టిన డా.ముఖర్జీ

దేశంలో కరోనా కేసులు విపరీతంగా వస్తున్నాయ్‌. రోజు మూడున్నర లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయ్‌. మరణాల రేటు కూడా ఎక్కవగానే ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని వైరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మే మొదటివారంలో రోజుకు 5 లక్షల కేసులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌వేవ్‌ మధ్య తేడా ఎంటో చూస్తున్నాం. అప్పుడు వేలల్లో కేసులు వస్తే… ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయ్‌.

మార్చి లేదా ఏప్రిల్‌లో సెకండ్ వేవ్ రావొచ్చని గతేడాది నవంబర్‌లో అంచనా వేశారు. ఊహించినదానికంటే తీవ్రంగా విరుచుకుపడింది. మహారాష్ట్రలో మొదలై ఇప్పుడు అన్ని రాష్ట్రాలను కలవరపెడుతోంది. కరోనా తీవ్రత చూస్తుంటే… కొన్నినెలల వరకు కేసులు తగ్గే అవకాశం కన్పించడం లేదు. జూన్‌లో కేసులు తగ్గితే… మరో 6 నెలలపాటూ తగ్గుతూనే ఉండే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఆ తర్వాత మళ్లీ పెరిగే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఆ లెక్కన అక్టోబర్ నుంచి థర్డ్ వేవ్ మొదలవుతుందనీ… నవంబర్‌లో జోరందుకుంటుందని అంటున్నారు నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here