Home News Updates

ప్రధాని మోడీ, సీఎంలకు రెండోదశ కరోనా టీకాలు..!

దేశంలో ప్రధాని మోడీతోపాటు అన్ని రాష్ట్రాల సీఏంలు రెండో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌లో టీకా వేయించుకోనున్నారు. మార్చి లేదా ఏప్రిల్‌ నెలల్లో‌ మోడీ వ్యాక్సిన్ వేయించుకునే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల అనధికార సమాచారం. ఈ నెల 11న సీఎంలతో జరిగిన మీటింగ్‌‌లో పొలిటీషియన్స్‌‌కు వ్యాక్సినేషన్ గురించి మోడీ పలు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

తొలి దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ టీకా వేయించుకుంటారు. రాజకీయ నేతలు తమ వంతు వచ్చినప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మోదీ చెప్పారు. అని ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా తెలిపాయి. ఫస్ట్ ఫేజ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌లో హెల్త్‌‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌‌లైన్ వర్కర్స్‌‌కు టీకా వేయగా.. రెండో దశలో 50ఏళ్లకు పైబడిన వారితోపాటు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు వ్యాక్సినేషన్ చేస్తారని నీతి ఆయోగ్ సభ్యుడు కొవిడ్-19 టాస్క్ ఫోర్స్‌‌కు హెడ్‌‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ వినోద్ పాల్ చెప్పారు.

దేశంలో కరోనా టీకా పంపిణీ జనవరి 16న ప్రారంభం కాగా.. చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైనప్పటికీని వ్యాక్సీనేషన్ పంపిణీ సజావుగానే సాగుతోంది. తొలి దశలో కరోనా యోధులకు వ్యాక్సిన్ అందజేయడంలో భాగంగా వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు టీకా వేస్తున్నారు. కాగా,రాజకీయ నాయకులు టీకాలను ఎప్పుడు తీసుకుంటారని పలువురు విమర్శిస్తుండగా. ప్రజాప్రతినిధులుగా తొలుత టీకాలు వారే వేయించుకోవాలనే డిమాండ్ కూడా విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

మూడు నెలల కిందట కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్‌వర్ధన్ మాట్లాడుతూ.. టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే తాను ఎయిమ్స్‌లో వ్యాక్సిన్ తీసుకుంటానని బహిరంగంగా ప్రకటించారు. కానీ, ఆయన ఈమాటను నిలబెట్టుకోలేదు. ఇదిలా ఉండగా.. ప్రధాని సహా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు రెండో దశలో వ్యాక్సినేషన్‌ తీసుకోనున్నారు. ప్రస్తుతం మొదలైన తొలిదశ ప్రక్రియ ఏప్రిల్ వరకూ కొనసాగనుండగా
రెండో దశలో 75 శాతం మంది పార్లమెంటు సభ్యులు, ముఖ్యమంత్రులు, మంత్రులు మొదలైనవారికి టీకాలు వేయనున్నారు. వీరిలో ముఖ్యంగా 50 ఏళ్లు, ఆపై వయసు వారికి తొలుత టీకా ఇస్తారని తెలుస్తోంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి టీకాలు వేయడంలో ప్రాధాన్యత ఇస్తూ, మొదటి డోసు ఇవ్వనున్నారు.

పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్‌ను అనుసరించి లోక్‌సభలో 343 మంది, రాజ్యసభలో 200 మంది ఎంపీలు 50 ఏళ్లు దాటినవారు కాగా.. మోదీ క్యాబినెట్‌లోని 95 శాతం మంది మంత్రులకు టీకాలు వేయనున్నారు. టీకా పంపిణీపై నవంబరు 24న ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రధాని మోదీ ఈ విషయం వెల్లడించినట్టుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. టీకా పంపిణీకి కేంద్రం రూపొందించిన కొవిన్ యాప్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. జనవరి 16న దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రారంభం కాగా.. పలు రాష్ట్రాల్లో యాప్ మొరాయించడంతో వ్యాక్సినేషన్ నిలిపివేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here