Home News Updates

ఎస్ బిఐలో మినిమం బాలన్స్ అక్కరలేదు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాల కోసం సగటు నెలవారీ బ్యాలెన్స్ కలిగి ఉండవలసిన అవసరాన్ని మాఫీ చేసినట్లు ప్రకటించింది. “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల కోసం సగటు మంత్లీ బ్యాలెన్స్ నిర్వహణను మాఫీ చేయాలని నిర్ణయించింది” అని బ్యాంక్ పత్రికా ప్రకటన పేర్కొంది. ఇప్పటి నుండి అన్ని ఎస్ బి ఐ కస్టమర్లు తమ పొదుపు బ్యాంకు ఖాతాలలో జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని పొందుతారు. దీనివల్ల 44.51 కోట్ల పొదుపు బ్యాంకు ఖాతాదారులకు లబ్ధి చేకూరుతుందని పత్రికా ప్రకటన తెలిపింది.

ప్రస్తుతం ఎస్ బి ఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వినియోగదారులు మెట్రో, సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో సగటున నెలవారీ బ్యాలెన్స్ రూ .3,000, రూ .2,000 మరియు రూ .1,000 ని నిర్వహించాలి. అంతేకాకుండా, నెలవారీ బ్యాలెన్స్‌ను నిర్వహించకపోవడంపై బ్యాంక్ 5 నుండి 15 రూపాయల వరకు జరిమానా విధిస్తుంది. ఇక అలాంటివి ఏవి వుండవు . మరో వైపు త్రైమాసిక ప్రాతిపదికన విధించే ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా బ్యాంక్ మాఫీ చేసింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here