Home Entertainment Cinema

ఇంకా తమన్నా మోజులోనే ఉన్న ఆ దర్శకుడు.. 

కొందరు దర్శకులు ఉంటారు.. వాళ్ళు ఒకసారి హీరోయిన్ కలిసొచ్చింది అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీకి ఎంతమంది వచ్చినా కూడా వాళ్లు మాత్రం ఆ హీరోయిన్ కావాలి అంటారు. ఇప్పుడు సంపత్ నంది కూడా ఇదే చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీకి రోజుకో హీరోయిన్ వస్తుంది. అందులో కొందరు ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తున్నారు కూడా. కానీ ఇప్పటికీ సంపత్ మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నానే కావాలంటున్నాడు. ఈమె మోజులోనే కొన్నేళ్లుగా ఉన్నాడు దర్శకుడు సంపత్ నంది. రచ్చ సినిమాతో ఈ కాంబినేషన్ కలిసింది. ఆ తర్వాత బెంగాల్ టైగర్ సినిమాలో కూడా ఈమెకే ఆఫర్ ఇచ్చాడు సంపత్. కానీ ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో సంపత్ మళ్లీ ఫేడవుట్ అయిపోయాడు.

Tamanna

గౌతమ్ నందా కూడా డిజాస్టర్ కావడంతో చాలా రోజుల తర్వాత మళ్లీ కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని వస్తున్నాడు. గోపీచంద్ తోనే ఈయన ప్రస్తుతం సిటీ మార్ సినిమా చేస్తున్నాడు. ఇందులోనూ తమన్నానే హీరోయిన్ గా తీసుకున్నాడు సంపత్ నంది. చాలా మంది కొత్త ముద్దుగుమ్మలు వచ్చినా కూడా ఇప్పటికీ తమన్నానే తీసుకోవడంపై నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు.

సీనియారిటీకి గౌరవం ఇచ్చి తీసుకున్నావా సంపత్ అంటూ ఆయనతో ఆడుకుంటున్నారు కూడా. ఏదేమైనా కూడా గోపీచంద్, తమన్నా జోడీ అంటే స్క్రీన్ పై కూడా ఫ్రెష్ గానే అనిపిస్తుంది. అందుకే సంపత్ ఈమెను తీసుకున్నాడేమో..? ఇప్పటికే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కచ్చితంగా ఈ చిత్రంతో సంపత్ సూపర్ హిట్ కొట్టి చూపిస్తానంటున్నాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here