Home Entertainment Cinema

చిరంజీవి సినిమాను సాయి ధరమ్ తేజ్ రీమేక్ చేస్తున్నాడా..

మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు ఇచ్చి ఇమేజ్ పాడు చేసుకున్న కూడా 2019లో రెండు హిట్ సినిమాలతో మళ్లీ రేస్ లోకి వచ్చాడు మెగా మేనల్లుడు. చిత్రలహరితో మంచి విజయం అందుకున్న ఈ హీరో.. ప్రతి రోజు పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరూ అంటూ వస్తున్నాడు సాయి. మే 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత దేవకట్టా దర్శకత్వంలో ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. ఈ సినిమా కథ విన్న వెంటనే ఆయన స్పెల్ బౌండ్ అయ్యాడని తెలుస్తోంది. తన కెరీర్లో కచ్చితంగా దేవాకట్ట సినిమా ఒక ప్రత్యేకంగా మిగిలిపోతుందని సాయి నమ్ముతున్నాడు.

Chiranjeevi
Chiranjeevi

ప్లాపుల్లో ఉన్న దేవా కట్టాతో ఇప్పుడు సినిమా చేస్తే అసలుకే మోసం వస్తుందని ఆయనకు కొందరు చెబుతున్నా కూడా కథ నచ్చి ముందడుగు వేస్తున్నాడు మెగా హీరో. ఇదిలా ఉంటే త్వరలోనే ఒక చిరంజీవి సినిమా రీమేక్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కెరీర్ కొత్తలో నటించిన మహానగరంలో మాయగాడు సినిమా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేదు. అయితే కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందులో చిరంజీవి పాత్ర కూడా అద్భుతంగా తేలింది. ఇప్పుడు అదే పాత్ర తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు సాయి ధరమ్ తేజ్.

దీనికి మారుతి దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి రోజు పండగే సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు జోడి కట్టపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా పై పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. దీంతోపాటు వీరుపోట్ల దర్శకత్వంలో ఒక పీరియాడికల్ డ్రామా చేయడానికి సాయి ఆసక్తి చూపిస్తున్నాడు. 40 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించబోతున్నాడని తెలుస్తుంది. ఈ గ్యాప్ లోనే చిరంజీవి సినిమా రీమేక్ కూడా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే ఈ సినిమాను రీమేక్ చేస్తే అంచనాలు మాత్రం భారీగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here