Home Entertainment Cinema

సాయి పల్లవి ఆ విషయంలో పట్టుదల అస్సలు వదలడం లేదుగా..

ఈ రోజుల్లో ఒక అమ్మాయి హీరోయిన్ గా నిలబడాలి అంటే చాలా త్యాగాలు చేయాలి. ఇండస్ట్రీ ఏదైనా కూడా స్టార్ గా నిలబడాలి అంటే చాలా కష్టపడాలి. అసలే క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఇబ్బందులు ఉన్న ఇండస్ట్రీలో కొందరు అమ్మాయిలు అవకాశాల కోసం దర్శక నిర్మాతలు అడిగింది ఇవ్వలేక కెరీర్ అర్ధాంతరంగా ముగిస్తున్నారు. మరి కొందరు హీరోయిన్లు కేవలం తమ టాలెంట్ ను నమ్ముకొని ఇక్కడ సత్తా చూపిస్తుంటారు. అయితే తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా ఒక హీరోయిన్ స్టార్ కావాలంటే అందం ప్లస్ అభినయంతో పాటు అందాల ఆరబోత కూడా ఉండాలి. గ్లామర్ ఇండస్ట్రీలో మడికట్టుకుని కూర్చుంటే సరిపోదు. పైగా ఇప్పుడు వస్తున్న హీరోయిన్లు కూడా అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు.

అన్నింటికీ సిద్ధమైన తర్వాత సినిమాల్లోకి వస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా సాయి పల్లవి లాంటి హీరోయిన్లు కేవలం అభినయంతో మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నారు. తాము ఇండస్ట్రీకి వచ్చింది అందాలు ఆరబోయడానికి కాదు న‌టిగా నిరూపించుకోవడానికి అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎంతోకొంత గ్లామర్ షో చేయకపోతే అవకాశాలు రావు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఇక్కడ అందాల ఆరబోత కూడా ప్రధాన ఆయుధం. ఇది అడ్డుపెట్టుకొని చాలా మంది హీరోయిన్లు కాస్త టాలెంట్ అటు ఇటుగా ఉన్నా కూడా స్టార్స్ అయిపోతున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం తాను ఆ టైప్ కాదు అంటుంది. ఇప్పటికే ముద్దులు పెట్టుకోవాల్సి వస్తుందని డియర్ కామ్రేడ్ సినిమాను.. ఎక్స్ పోజింగ్ చేయమన్నారు అని మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాను వదిలేసుకుంది సాయి పల్లవి.

ఒకప్పుడు సౌందర్యకు కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆమె కెరీర్ డైలమాలో పడిన సమయంలో స్టార్ హీరోల సినిమాల్లో కాస్త పద్ధతులు పక్కకు జరిపి హద్దులు మీర‌కుండా గ్లామ‌ర్ షో చేసింది సౌందర్య. కానీ ఇప్పుడు సాయి పల్లవి అలా కూడా చేయను అంటోంది. ప్రస్తుతం ఈమె విరాటపర్వంతో పాటు శేఖర్ కమ్ముల-నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత సాయి పల్లవి కెరీర్ ఏమవుతుందో అని అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. ఎంతో కొంత కచ్చితంగా గ్లామర్ షో చేయకపోతే ఇక్కడ నెగ్గుకురావడం కష్టం. మరి ఈ విషయాన్ని సాయి పల్లవి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో..? ఏదేమైనా తన కోసం దర్శకులు పాత్రలు రాసినప్పుడు నటించడానికి సిద్ధంగా ఉంటాను.. అలా కాకుండా ఎక్స్ పోజింగ్ చేయాలి అంటే వెళ్ళి నా డాక్టర్ వృత్తిని చేసుకుంటాను అని చెబుతుంది సాయి పల్లవి. ఒక అప్ కమింగ్ హీరోయిన్ కు ఇంత తెగువ ఉండటం నిజంగానే గొప్ప విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here