Home Entertainment Cinema

సాయి పల్లవి మరోసారి తెలంగాణ బాట పట్టిందే..

ఫిదా అనే ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి. ఈ చిత్రం తర్వాత చాలా రోజుల వరకు ఇండస్ట్రీలో భానుమతి పేరు వినిపించింది. అంతగా ఆ పాత్రకు ప్రాణం పోసింది సాయిపల్లవి. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ ఫిదా బ్యూటీగానే సాయి పల్లవికి పేరుంది. దానికి కారణం అందులో ఆమె నటన ఒకెత్తు అయితే.. తెలంగాణ యాసలో మాట్లాడటం మరో ఎత్తు. పేరుకు తమిళమ్మాయి అయినా కూడా తెలుగు నేర్చుకుని.. తెలంగాణ మాండలికాన్ని అద్భుతంగా పలికించింది సాయి పల్లవి. ఆమె భాషకు అప్పట్లో చాలా మంది అభిమానులు అయిపోయారు. ఇప్పుడు కూడా ఇదే మరోసారి చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా మళ్లీ తెలంగాణ అమ్మాయిగా మాయ చేయడానికి రెడీ అవుతుంది సాయి పల్లవి.

ప్రస్తుతం ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది. ఇందులో నాగ చైతన్య హీరో. ఈయన కూడా ఇందులో తెలంగాణ అబ్బాయిగానే కనిపిస్తున్నాడు. ఇద్దరూ తెలంగాణ ప్రాంతం నుంచే వస్తారన్నమాట. వాళ్ల మధ్య లవ్ స్టోరీయే ఈ కథ. మ్యూజికల్ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటికే షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. సమ్మర్ కానుకగా సినిమా విడుదల కానుంది. ఇందులో కూడా సాయి పల్లవి మాటలకు కచ్చితంగా ఫిదా అయిపోతారు ప్రేక్షకులు అంటున్నాడు కమ్ముల. ముఖ్యంగా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ప్రోమోలో కూడా తెలంగాణ భాషలోనే మాట్లాడుతూ కనిపించింది పల్లవి. ఒక్క ముక్క అయినా కూడా అద్భుతంగా అనిపించింది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దాంతో పాటు విరాట పర్వం సినిమాలో కూడా తెలంగాణ యాసలోనే మాట్లాడబోతుందని తెలుస్తుంది. ఇందులో నక్సలైట్ గా నటిస్తుంది సాయి పల్లవి. రానా పోలీస్ ఆఫీసర్. జూన్ లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా కనిపిస్తే మాత్రం కాసుల వర్షం కురిపిస్తాయని నమ్ముతున్నారు నిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here