Home Entertainment Cinema

RRR సీన్ లీక్.. కలవరపడుతున్న రాజమౌళి..

ఆర్ఆర్ఆర్ యూనిట్ కు మరో షాక్ తగిలింది. అది కూడా అస్సలు ఊహించని దెబ్బ ఇది. చాలా పకడ్బందీగా షూటింగ్ చేస్తున్నా కూడా ఎక్కడ్నుంచో ఓ చోట నుంచి లీకులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ పై చిత్రీకరించిన పులి ఫైట్ వీడియో లీక్ అయిందిప్పుడు. ఇది చూసి యూనిట్ అంతా షాక్ అయ్యారు.

వీడియో బయటికి వచ్చిందని తెలియగానే యూనిట్ అప్రమత్తమై కాపీరైట్ ఇష్యూ కింద సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలన్నింటినీ కూడా డిలీట్ చేయించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫేస్ బుక్, ట్విట్టర్ సహా అన్నింట్లోనే ఈ వీడియో బాగానే వైరల్ అవుతుందిప్పుడు. లింకులు తీసేసినా డౌన్ లోడింగ్ ఫైల్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి. దాంతో లీక్డ్ వీడియో బాగానే సందడి చేస్తుందిప్పుడు. లక్షల నుంచి కోట్ల మందికి గ్రూపుల్లో చేరుతుంది ఈ వీడియో.

ఇందులో కొమరం భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ అండర్ వేర్ తో ఉన్నాడు. పులితో ఫైట్ చేస్తున్నాడు. పైగా ఆయన రన్నింగ్ స్టైల్ అదిరిపోయిందంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. సినిమాలో ఇది అత్యంత కీలకమైన ఫైట్.. రాజమౌళి కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. కానీ ఇలా చేసిన ఫైట్ సింపుల్ గా అలా లీక్ కావడంతో యూనిట్ కూడా బాధ పడుతున్నారు. ఎన్టీఆర్ ఇంట్రో కోసం ఈ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నారని తెలుస్తుంది. షూటింగ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలా వీడియోలు బయటికి వచ్చేస్తుండటంతో రాజమౌళి కూడా చాలా సీరియస్ అవుతున్నాడు. ఆ మధ్య ఆర్ఎఫ్సీ షెడ్యూల్ కూడా ఇలా లీక్ అయింది. గతంలో బాహుబలికి కూడా లీకుల బెడద తప్పలేదు. మొత్తానికి చూడాలిక.. చివరికి ఏం జరుగుతుందో..?