Home Entertainment Cinema

RRR ప్రీ రిలీజ్ బిజినెస్ తెలిస్తే గుండె ఆగిపోతుంది

తెలుగు సినిమా మార్కెట్ ను తన ప్రతి సినిమాతో పెంచేస్తున్నాడు రాజమౌళి. ఈయన ఒక్కో సినిమా చేస్తుంటే టాలీవుడ్ రేంజ్ కూడా అలాగే పెరిగిపోతుంది. బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో కూడా మన జెండా ఎగురవేశాడు దర్శక ధీరుడు. దెబ్బకు ఉత్తరాది మార్కెట్ కంటే తెలుగు సినిమా రేంజ్ పెద్దది అని బాహుబలి సినిమాతో నిరూపించాడు జక్కన్న. ఇక ఇప్పుడు ఈయన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం పూర్తయిపోతుంది. తెలుగు సినిమా కలలో కూడా ఊహించని స్థాయిలో ఈ చిత్ర బిజినెస్ జరుగుతుంది. ఒకే సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్స్ ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా మరో ఆలోచన లేకుండా చెప్పిన రేటుకు ఈ సినిమా రైట్స్ కొంటున్నారని ప్రచారం జరుగుతోంది

ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం త్రిబుల్ ఆర్ సినిమా బిజినెస్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 232 కోట్ల వరకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో ఏకంగా 85 కోట్లకు ఈ సినిమా రైట్స్ తీసుకుంటున్నాడు దిల్ రాజు. సీడెడ్ 40 కోట్లు.. ఉత్తరాంధ్ర 30 కోట్లు.. కృష్ణా 15 కోట్లు.. ఈస్ట్ 18 కోట్లు.. వెస్ట్ 14 కోట్లు.. గుంటూరు 20 కోట్లు.. నెల్లూరు 10 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నిజంగానే మిగిలిన హీరోల గుండె ఆగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ అందుకున్న సినిమాలే చాలా తక్కువగా ఉన్నాయి. బాహుబలి 1, 2 పక్కనపెడితే సైరా, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ అందుకున్నాయి. అలాంటిది ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 232 కోట్ల బిజినెస్ చేస్తుందంటే 250 కోట్ల షేర్ వసూలు చేయాల్సిందే. రాజమౌళి ప్లేస్ లో మరో దర్శకుడు ఉండుంటే ఇది నిజంగానే పెద్ద రిస్క్ అనుకునే వాళ్లంతా. కానీ అక్కడున్నది దర్శకధీరుడు కాబట్టి 250 కాదు 300 కోట్లు కూడా వసూలు చేస్తుందని నమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. 2021 జనవరి 8న త్రిబుల్ ఆర్ విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 450 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది ఈ సినిమా. హిందీలో కూడా ఈ సినిమా రైట్స్ కోసం ఎగబడుతున్నారు అక్కడి నిర్మాతలు. 300 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు DVV దానయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here