Home News

పాలిటిక్స్ కంటే పారాయణమే బెటర్ అంటున్న ఫైర్ బ్రాండ్…!

ఫైర్‌ బ్రాండ్ అన్న పేరు నష్టం చేసిందా? నోటికొచ్చినట్లు మాట్లాడటమే మైనస్ అయ్యిందా? ప్రత్యర్ధులపై ఒంటి కాలితో లేచే ఆమె ఇప్పుడెందుకు మౌన ముద్రలో ఉన్నారు.? ఏం జరిగినా పట్టీ పట్టనట్టు ఉండటం వెనుక ఆంతర్యం ఏంటి? ఆమెది వ్యూహమా….? అనుభవం నేర్పిన పాఠమా? ఆమె అలా ఎందుకు మారారు.? రాజకీయాల్లో ఎక్కడికో వెళ్లాలనుకున్న ఆమె… అధ్యాత్మికత వైపు మళ్లుతున్నారా? దైవచింతనలో శేష జీవితం గడపడానికి ఫిక్స్‌ అయ్యారా?వైసీపీ ఫైర్ బ్రాండ్.. రోజా కనిపిస్తున్నారు… కానీ మాట్లాడటంలేదు… ఎప్పుడూ దూకుడుగా మాట్లాడే రోజా ఇప్పుడు పలుకే బంగారం అన్నట్టు ఉంటున్నారు … అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ మధ్య రోజూ ఏదో ఒక అంశంపై వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి… వైసీపీ మీద టీడీపీ… టీడీపీ మీద వైసీపీ సభ్యులు విమర్శలు గుప్పించుకుంటుండటంతో అసెంబ్లీ హాట్‌హాట్‌గా జరుగుతోంది. అయితే సభలోనే ఉంటున్న రోజామాత్రం నోరు మెదపడం లేదు. తనకేం పట్టనట్టు కామ్ గా కూర్చుండిపోతున్నారు… రోజా మౌనం వెనుక పెద్ద కథే ఉందని సన్నిహితులు చెబుతున్నారు.

ప్రతిపక్షంలో ఉండగా అధికార టీడీపీని ఇబ్బంది పెట్టడానికి గట్టిగానే ప్రయత్నించారు రోజా … సబ్జెక్ట్ ఏదైనా అనర్గళంగా మాట్లాడే రోజాను ఎదుర్కొడానికి అప్పట్టో టీడీపీ ప్రత్యేకంగా స్ట్రాటజీ రూపొందించుకోవాల్సి వచ్చేది… టీడీపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్న రోజా అదే స్థాయిలో అనేక ఇబ్బందుల్లోనూ పడ్డారు… గతంలో ఏ ఎమ్మెల్యేకి జరగని విధంగా ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్సెండ్ అయ్యారు రోజా… అమె సస్పెన్షన్‌ ఎఫెక్ట్‌తో వైసిపి సభ్యులు మొత్తం అసెంబ్లీ మెట్లెక్కడం మానేశారు …

అలాగే ఉమెన్ పార్లమెంటరీ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వెళ్లిన రోజాను పోలీసులు నానాతిప్పలు పెట్టారు… అన్ని తట్టుకుని మొన్నటి ఎన్నికల్లో తిరిగి నగరి నుంచి గెలిచారు రోజా… ఫలితాలు రాక ముందే రోజా మంత్రని… హోం మంత్రని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది… కానీ… అనూహ్యంగా ఆమెకు కేబినెట్ లో చోటు దక్కలేదు. రోజా పేరు లేని కేబినెట్ లిస్ట్ చూసిన వైసీపీ కేడర్ తోపాటు…. ఆమె కూడా షాక్ కి గురవ్వల్సి వచ్చింది… తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర ఆవేదనకు గురైన రోజా కన్నీటి పర్యంతం అయ్యారట. ఆమెను ఓదార్చిన జగన్… ఎపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు.

అయితే రోజాలో మాత్రం అమాత్య పదవి దక్కలేదన్న బాధ, ఆవేదన మాత్రం తగ్గలేదట… తాను ఓవర్‌ యాక్టివ్ గా ఉండటం వల్లే తనకు మంత్రి పదవి రాలేదని నమ్ముతున్నారంట నగరి ఎమ్మెల్యే.. రోజాను మంత్రిని చేస్తే అందర్నీ మించిన ప్రజాదరణ వస్తుందనే కారణంతోనే పక్కన పెట్టారనే భావన ఆమె సన్నిహితుల్లో వ్యక్తమవుతోంది… మంత్రి పదవికి ప్రత్యామ్నాయంగా ఎపీఐసీసీ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పిన … నెల రోజులకు దానికి సంబంధించిన జీఓ ఇవ్వడం కూడా చర్చనీయాంశమవుతోంది… రోజాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని కానీ… ఇస్తున్నామనే భావన కానీ రాకూడదన్న ఉద్దేశంతోనే అలా చేసారని ఆమె అనుమానిస్తున్నారంట… జగన్ తర్వాత జగన్ స్థాయిలో టీడీపీపై పోరాడినప్పటికీ … తననూ మిగిలిన నేతలతో సమానంగా చూస్తున్నారని రోజా తెగ ఫీలవుతున్నారంట..ఇదంతా తన హైపర్ యాక్టివ్ వల్లే వచ్చిందని రోజా అనుకుంటున్నారని సమాచారం. తన దూకుడు, తన మాటలే తనకు నష్టం చేశాయనే ఫీలింగ్ లోఉన్న రోజా… సైలెంట్ అవడమే మంచిదని డిసైడ్ అయ్యారట. అందు కోసమే… ఎవరి మీదా విమర్శలు చేయడం కానీ…. అసెంబ్లీలో నోరు విప్పడం కానీ చేయడం లేదట … సినిమాల్లో రాణించి, రాజకీయాల్లో ఇంకా ఎత్తుకు ఎదుగుదామనుకున్న ఆమె ప్రస్తుత పరిస్థితులు కలిసిరాకపోవడంతో కలత చెందుతున్నారంట.. పార్టీ అధికారంలోకి వచ్చినా చేతినిండా పని లేకపోవడంతో కొత్త వ్యాపకంపై దృష్టి పెట్టారట రోజా…

అందుకే ఆధ్యాత్మికరంగం వైపు దృష్టి మరల్చారట… ధార్మిక విషయాలు, స్త్రోత్రాలు కలిపి శ్రీ పూర్ణిమ గ్రంధం పేరిట ఓ పుస్తకం రాస్తున్నారట రోజా… దేవుళ్లన్నా, దైవకార్యాలన్నా విపరీతమైన నమ్మకం ఉండే రోజా ఇలాంటి గ్రంధం రాయడానికి పూనుకోవడం గొప్ప సంకల్పమే .. . త్వరలో జగన్ చేతులు మీదుగా ఈ గ్రంధాన్ని ఆవిష్కరించాలని చూస్తున్నారు రోజా… మొత్తానికి తక్కువ సమయంలోనే సూక్ష్మంలో మోక్షాన్ని గ్రహించినట్లు కనిపిస్తున్నారు మన మాజీ హీరోయిన్‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here